మన్మథుడు గ్లామర్ రహస్యం ఏమిటో తెలుసా?
గ్లామర్ మెయిన్ టైన్ చేయడం ఒక్క నాగార్జునకే సాధ్యం. అందుకే 59 ఏళ్ల వయసులో కూడా మన్మధుడు 2 అన్నా ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి.ఇంత ఫిట్ గా నాగ్ ఎలా ఉండగలుగుతున్నాడు అనే సందేహం ఎవరికైనా వస్తుంది. నాగార్జునతో పాటు పిల్లలు చైతన్య , అఖిల్ ని పక్కన పెట్టి చూస్తే, అన్నదమ్ములు అని పరిచయం చేస్తే తెలియనివాళ్ళు ఈజీగా నమ్మేస్తారు. అంతగా నాగ్ గ్లామర్ బాయ్ గా ఉంటాడు. దీనివెనుక అసలు రహస్యం ఏమిటో చూద్దాం. నాగ్ ప్రతిరోజూ ఖచ్చితంగా 8 లేదా 9 గంటల నిద్రను పాటిస్తారు.
ఎంత ఒత్తిడి ఉన్నా ఇది మాత్రం కంపల్సరీ. ఇక ఉదయం లేవగానే ఓ గ్లాసు నీళ్ళలో కుంకుమ పువ్వు వేసుకుని పావు గంట తర్వాత తాగెస్తారు. రోజూ ఎప్పుడైనా సరే ఓ అల్లం ముక్క నమలడం నాగ్ అలవాటు. మసాలాలు ఎక్కువగా వాడే ఆయిల్ ఫుడ్ కి కింగ్ దూరం పాటిస్తాడు. గరం మసాలా అంటే అస్సలు పడదు. దాన్ని మాడ్చేసి తింటే అది విషంతో సమానమని చెబుతారు. ఇక నాగ్ ఇష్టపడేది రోటి పచ్చళ్ళు. ఎప్పుడో రెండు నెలల క్రితం తయారు చేసి బెస్ట్ బిఫోర్ అనే పికిల్స్ ని ఇష్టపడరు.
ఇక యోగ తప్పనిసరిగా చేయాల్సిందే. వెయిట్ లిఫ్టింగ్ మానేశారు కాని దానికి ప్రత్యామ్నాయం యోగా అని నమ్ముతారు. బీట్ రూట్, బీరకాయ తొక్కల పచ్చళ్ళు నాగ్ ఫేవరేట్. విటమిన్స్ ఉండటమే కారణం. ఇండియాలోనే కాదు ఏ దేశం వెళ్ళినా నాగ్ డైట్ ప్లాన్ ఇదేనట. ఇదే కంటిన్యూ చేస్తే,హాఫ్ సెంచరీ దాటినా మనం కూడా నాగ్ లా ఉండొచ్చున్నమాట.