Valentine's day

అమ్మాయిలు టెడ్డీబేర్స్‌ని ఎందుకు ఇష్టపడతారంటే..

చాలా సినిమాల్లో హీరోయిన్స్ ఇంట్రడక్షన్ సీన్స్‌లో హీరోయిన్ పక్కనే టెడ్డీ బేర్ కనిపిస్తుంది. కేవలం హీరోయిన్స్‌ క్యారెక్టర్స్‌కి మాత్రమే కాదు సామాన్య అమ్మాయిలకి కూడా టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం. దూదిపింజల్లా ఉండే వీటిని చిన్నప్పట్నుంచే ఎంతో ఇష్టపడతారు.టెడ్డీ బేర్స్‌ని ఓ పెట్‌లా చూసుకుంటారు. పడుకునే సమయంలోనూ అవి పక్కనే ఉండాల్సిందే. మామూలుగానే మృదుస్వభావమైన అమ్మాయిలు టెడ్డీ బేర్స్ మృదుత్వాన్ని ఆస్వాదిస్తారు.

అయితే, టెడ్డీస్‌ని వారి ఇంటి వరకే కాదు.. కీ చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాగ్స్ ఇలా ప్రతీ వాటిల్లోనూ అవి ఉండేలా చూసుకుంటారు. వాటిని చూడగానే ఖచ్చితంగా వారి ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. అందుకే.. వాళ్లని ఇంప్రెస్ చేయడానికి టెడ్డీస్‌ని కూడా ఇస్తారు.ప్రేమ ఆనందాన్ని రెట్టింపు చేసే ప్రతీ వస్తువుకి వాలెంట్స్‌ వీక్‌లో స్థానం ఉంది. అందులో టెడ్డీ డే కూడా ఒకటి. అదే టెడ్డీస్ మాయాజాలం. అందుకే అమ్మాయిలు వీటికి ఎప్పుడూ ఫ్యాన్సే.