యాంకర్ లాస్య గురించి షాకింగ్ విషయాలు… పెళ్లి అయ్యాక ఏమి చేస్తుందో తెలుసా?
టివి షోస్ లో యాంకర్స్ పాత్ర చాలా కీలకం. అందుకే చాలామంది యాంకర్లు ఆయా షోలలో దూసుకుపోతున్నారు. కొందరు వివాదాలలో కూడా చిక్కుకుంటుంటే,కొందరు అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. కొందరు సుమ లాగా ఎలాంటి వివాదాల్లో తలదూర్చకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. అందులో బబ్లీ గర్ల్ లాస్య తనదైన శైలిలో యాంకర్ రేష్మి లాంటి అందగత్తెలతో పోటీపడుతూ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. చలాకీగా జోకులు పేలుస్తూ యాంకరింగ్ లో తనదైన ముద్ర వేసింది.
ఇక మేల్ యాంకర్ రవితో కెమిస్ట్రీ అద్భుతంగా పండుతుంది. వీళ్లపై కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. ఇక వీళ్లద్దరూ స్క్రీన్ మీద కనిపిస్తో టిఆర్పి రేటింగ్ అదిరిపోతుందని చెప్పవచ్చు. ఇక ఇద్దరి మధ్యా రిలేషన్ షిప్ గురించి సాగిన ప్రచారం కూడా గాసిప్స్ గానే తేలిపోయింది. మరాఠీ బ్యాక్ గ్రౌండ్ గల ఈమె చివరకు మరాఠీకి చెందిన మంజునాధ్ ని ప్రేమించి పెళ్ళిచేసుకుని యుఎస్ లో సెటిల్ అయింది.
మంజునాధ్ కి అనేక వ్యాపారాలున్నాయి. పెళ్లితర్వాత యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసిన లాస్య ఎక్కడుందో ఏమి చేస్తోందో ఎవరికీ తెలీదు. అయితే లాస్య టాక్స్ పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం అందరికి ఒకింత ఆశ్చర్యం కల్గించింది. పెళ్లి తర్వాత కొత్త ప్రొఫెషన్ ఎంచుకుని దూసుకుపోతోంది.
పండుగలు,సంస్కృతి వంటి వివిధ రకాల టాపిక్స్ తీసుకుని వీడియోలు రూపొందిస్తూ, ఛానల్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే 40 వేలమంది సబ్ స్క్రైబర్స్ ని సాధించింది ఛానల్. అయితే చేసిన వీడియోలు నాలుగు పదులు కూడా దాటకుండానే లక్షలమంది వ్యూయర్షిప్ ఉండడం నిజంగా గ్రేట్.