Movies

టాలీవుడ్ మన్మధుడు బట్టతల రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నాడో తెలుసా?

కొందరికి వంశ పారంపర్యంగా బట్టతల వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో తాతకో ,తండ్రికో బట్టతల ఉంటె అది జెనిటిక్ గా ఇంట్లో వాళ్లకు కూడా ఆటోమేటిక్ గా వస్తుందని వైద్యులు కూడా చెప్పేమాట. సినిమావాళ్ళకు కూడా బట్టతల రావడం షరామామూలే. ఇండస్ట్రీలో అగ్ర హీరోగా వెలుగొందిన అక్కినేని నాగేశ్వరరావుకి బట్టతల ఉండగా, ఆయన పెద్దకొడుకు వెంకట్ కి కూడా బట్ట తల వచ్చేసింది. మరి రెండో కొడుకు, కింగ్ నాగార్జునకు మరి బట్టతల వచ్చిందా,రాలేదా, వస్తే విగ్ తో కవర్ చేశాడా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి.

ఎందుకంటే, నాగార్జున జుట్టు బానే ఉంటుంది. మరి బట్టతల సమస్యనుంచి తప్పించుకున్నాడని అనుకుంటున్నారు కొందరు. టాలీవుడ్ లో మన్మధుడిగా నిత్య యవ్వనంతో రాణిస్తున్నాడు కదా. ఎందుకంటే ఎక్కువగా ఆయుర్వేదం మందులు వాడతాడట. అయితే నిజానికి నాగ్ కి కూడా బట్టతల వచ్చే సూచనలు 28ఏళ్ళ వయస్సులోనే కనిపించిందట. జుట్టు పలచబడటం చూసి,ఇదేమిటి రా బాబూ అనుకున్నాడట. వెంటనే కేరళలో దొరికే ఓ ఆయుర్వేదం ఆయిల్ రాసుకుంటే తగ్గిపోతుందన్న విషయం తెలుసుకున్నాడు.

ఆయుర్వేదం తైలం కోసం అసిస్టెంట్ ని కేరళ పంపించాడు. అక్కడ మనిషికి ఒక్క బాటిల్ చొప్పున మాత్రమే ఇస్తారట. పైగా 80రూపాయలు మాత్రమేనట. దీంతో అక్కడ వాకబు చేస్తే బ్లాక్ లో 500రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్టు తెలుసుకుని ఆరునెలలకు సరిపడా బాటిల్స్ కొనేసి తెచ్చాడట. అది వాడడంతో జుట్టు ఒత్తుగా పెరగడం,పలచబడ్డ చోట కొత్తగా రావడం జరిగిందట. దీంతో మళ్ళీ ఇప్పటివరకూ జట్టుపలచబడ్డ దాఖలాలు లేవట. అదండీ నాగ్ కి బట్టతల రాకపోవడానికి అసలు కారణం.