Movies

కమల్ హాసన్ ఆస్థి విలువ ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెడతారు

నటనలో ఆరు దశాబ్దాలు,స్టార్ హీరోగా మూడు దశాబ్ధాలు అనుభవం గల హీరో అనగానే కమల్ హాసన్ అని ఠక్కున చెప్పేస్తారు. తమిళ తెలుగు,హిందీ తదితర భాషల్లో వివిధ రకాల పాత్రలు,విభిన్న పాత్రలు పోషించిన కమల్ హాసన్ పోషించినన్ని డిఫరెంట్ రోల్స్ ఎవరూ పోషించలేదని చెప్పవచ్చు. అంతే కాదు దేశంలో ఇలాంటి నటుడు మళ్ళీ పుట్టడని కూడా చాలామంది అనేమాట. దర్శక దిగ్గజం కె బాలచందర్ శిష్యుడిగా కమల్ హాసన్ తమిళ, తెలుగు సినీ రంగంలో ఎదురులేని హీరోగా నిలిచాడు. నటన రంగంలో పుట్టి పెరిగిన కమల్ హాసన్ తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక రాజకీయ పార్టీ కూడా స్థాపించి వేగంగా పావులు కదుపుతున్నారు.

ప్రస్తుతం కమల్ నటిస్తున్న భారతీయుడు – 2షూటింగ్ జరుగుతోంది. ఇక్కడే భారతీయుడు వన్ షూటింగ్ జరిగింది. ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రఖ్యాత టైమ్స్ జాబితాలో కమల్ పేరు నిల్చింది. మరి ఇంతటి స్టార్ హీరో ఇన్నాళ్లూ ఎంత సంపాదించాడో కూడా పూర్తిగా ఎవరికి తెలీదు.

బయటకు చెప్పేది కొంతైతే,చెప్పనది కొంత ఉంటుందని అంటారు. ఆస్థి ఉన్నవారికి ఆస్తులు పెరుగుతాయి తప్ప తరగవు అనే సామెత ఉంది. దీన్ని బట్టి చూస్తే కమల్ ఆస్తులు 200కోట్లకు పైగానే ఉంటాయని విశ్లేషకుల అంచనా. ఏడాదికి 8కోట్ల రూపాయల వరకూ ఆదాయపు పన్ను కడ్తున్న కమల్ ఏడాదికి 50కోట్ల ఆదాయం ఉంటుందని అంటారు. ఇక చెన్నైలో కమల్ హాసన్ కి గల ఇంటివిలువ రెండేళ్ల క్రితం 30కోట్లు ఉంటే ,ఈరెండేళ్లలో అనూహ్యంగా 55కోట్లకు చేరిందని విశ్లేషకులు లెక్కకడతారు.

ఇక చెన్నైలో పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్స్ ఉన్నాయి. ఖరీదైన కార్ల సంగతి అయితే చెప్పక్కర్లేదు. రేంజ్ రోవర్ ఆడి 800 వంటి కార్ల విలువ 5కోట్లు పైమాటే. నీలం కరై అనే 75కోట్ల విలువ చేసే ఇల్లుంది. బెంగుళూరులో కూడా ఆస్తులున్నాయి. ముంబయిలో కూడా కూతురికి సొంత ఇల్లుంది.