సమంత పెళ్లి అయ్యాక ఆస్తుల విలువ ఎంత పెరిగిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
స్టార్ హీరోయిన్ గా తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న సమంత మరో రెండేళ్లలో హీరోయిన్ గా దశాబ్దకాలం పూర్తిచేసుకోనుంది. ఏం మాయ చేసావే మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ 8ఏళ్ళ కాలంలో దాదాపు 45చిత్రాలు చేయడమేకాదు, నాగచైతన్యను లవ్ మేరేజ్ చేసుకుని అక్కినేని వంశంలో కోడలిగా అడుగుపెట్టి హీరోయిన్ గా కూడా కెరీర్ లో దూసుకుపోతోంది. హీరోయిన్ గానే కాదు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా భారీగానే సంపాదిస్తోంది. రెండుచేతులా కూడబెడ్తున్న ఈమె సంపాదన తెలిస్తే షాకవుతాం.
ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్న అక్కినేని సమంత ఒక్కో సినిమాకు కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకూ రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఇక వివిధ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా చేస్తూ మొత్తం మీద ఏడాదికి 6నుంచి 13కోట్ల రూపాయల వరకూ సంపాదిస్తోంది. ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.
మరికొన్ని ప్రాజక్ట్స్ కూడా లైన్ లో వున్నాయి. బ్రాండ్ ప్రమోషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఈమెకు దాదాపు వందకోట్ల పైగా ఆస్తులున్నట్లు టాక్.
సమంతకు సినిమా రెమ్యునరేషన్ కి బదులుగా అపార్ట్ మెంట్లు, విల్లాలు ముట్టజెప్పినట్లు టాక్. లక్ష ఖరీదైన బ్రాండ్ ఛానల్ అనే మేకప్ కిట్ ని సమంత సొంతం అయింది.
ఇక ఇంట్లో పనిచేసేవాళ్లకు వేలు,లక్షల్లో రెమ్యునరేషన్ అందిస్తోంది. హైదరాబాద్ లో గల ఆమె ఇంటి ఖరీదు అక్షరాలా 10కోట్లు. ఇక ఆమెకు జాగ్వార్ ఎక్సెస్ కార్ 62లక్షలు,ఆడి క్యూ సెవన్ కార్ 70లక్షలుఫోర్డ్స్ కారు కోటి 15లక్షలు ఇలా విలువైన కార్లతో పాటు ఖరీదైన అపార్ట్ మెంట్స్ విల్లాలు ఉన్నాయి.