చిరంజీవి బయోపిక్ గురించి నాగబాబు షాకింగ్ కామెంట్స్
సినిమా రంగంలో ఏ ట్రెండ్ నడుస్తుంటే అందరూ అదే దారిలో పయనిస్తారు. ఇది గతం నుంచీ వస్తున్నదే. అయితే ఇప్పుడు బయోపిక్ ల సీజన్ అని చెప్పాలి. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన మహానటి మూవీ తెలుగులో దీనికి నాంది అని చెప్పక తప్పదు. నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సెన్షేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన ఈమూవీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీనితర్వాత ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు,వైస్సార్ బయోపిక్, కాంతారావు బయోపిక్, ఘంటసాల బయోపిక్ ఇలా పలువురి జీవిత కథలు తెరకెక్కుతున్నాయి.
ఇందులో ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల కాగా వైస్సార్ బయోపిక్ కూడా విడుదలైంది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం మహానాయకుడు రావాల్సి ఉంది. అలాగే బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ కూడా రాబోతోంది. ఇక మరొకరి బయోపిక్ కోసం టాలీవుడ్ లో చర్చకు దారితీసింది. అదేంటంటే, ఎన్నో కష్టాలు అధిగమించి స్వయం కృషితో తిరుగులేని స్టార్ గా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి జీవితాన్నీ సినిమాగా తీస్తారంటూ ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపించే మాట.
సినీ జీవితంలోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు చూసిన చిరంజీవి గురించి బయోపిక్ తీస్తే బానే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. సినీ క్రిటిక్స్ కూడా ఇదే ప్రస్తావన చేస్తున్నారు. ఈ విషయాన్ని మెగా బ్రదర్ నాగబాబు దగ్గర ప్రస్తావిస్తే,ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. బయోపిక్ అంటే ఉన్నది ఉన్నట్లు తీయాలి. అలా కాకుండా కల్పిత కథ జోడించి, ఉన్నది దాచేస్తే అది బయోపిక్ అని అనలేం. అయితే చిరంజీవిపై బయోపిక్ తీసే ఆలోచన మా కుటుంబంలో ఎవరికీ లేదు.
చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కి కూడా అలాంటి కోరిక లేదు. అంతెందుకు తనమీద బయోపిక్ తీస్తే చిరంజీవి కోరుకోడు’అని నాగబాబు వ్యాఖ్యానించాడు. సక్సెస్ లు కల్పి సినిమా తీస్తే అది బయోపిక్ అవ్వదని ,ఆటుపోట్లు అన్నీ కలిపి తీస్తేనే బయోపిక్ అవుతుందని చెప్పుకొచ్చాడు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ హిట్ అవుందంటూ నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేసాడు. వర్మను వ్యక్తిగా కంటే డైరెక్టర్ గా అభిమానిస్తానని అన్నాడు. లక్ష్మీపార్వతి కోణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉంటుందని చెప్పినందున ఆసక్తికరంగా మారిందని చెప్పాడు.