Movies

తెలంగాణ శకుంతల చేతిలో చిల్లిగవ్వ లేక ఎలా ఇబ్బంది పడిందో తెలుసా?

సినిమా వాళ్ళ అందరి జీవితాలు పైకి కనిపించేంత గొప్పగా ఉండవు. ఎవరి కష్ఠాలు వారివే అన్నారు పెద్దలు. ఇక తెలంగాణా శకుంతలగా పేరుతెచ్చుకున్న కడియాల శకుంతల నిజానికి మహారాష్ట్రలో పుట్టింది. ఒంటికాలు పరుగు అనే నాటకంలో రంగస్థల జీవితం ప్రారంభించి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. బి నరసింగరావు తీసిన మా భూమి మూవీతో సినిమా రంగప్రవేశం చేసింది. రెండవ చిత్రం కూడా నరసింగరావు డైరెక్షన్ లోని రంగులకల మూవీలో నటించింది. పలు సినిమాల్లో తెలంగాణా,రాయలసీమ మాండలీకాల్లో పలికే డైలాగులు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. పాండవులు పాండవులు తుమ్మెద ఆమె చివరి సినిమా.

శకుంతల భర్త ప్రసాద్ రిటైర్డ్ ఉద్యోగి. వీరికి కుమారుడు తేజస్ , కుమార్తె సుశీల ఉన్నారు. క్యారెక్టర్ నటిగా, విలన్ గా,హాస్య నటిగా శకుంతల నటన ఆడియన్స్ కి దగ్గరకు చేర్చాయి. చాలా సినిమాల్లో తెలంగాణా యాస మాట్లాడడంతో తెలంగాణ ఇంటిపేరుగా రూపాంతరం చెందింది. తెలుగులో దాదాపు 80చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించింది. ఒసే రాములమ్మ , నువ్వూ నేను, గులాబీ,ఒక్కడు వంటి చిత్రాలు ఆమె నటనకు అద్దంపట్టాయి.

మత్యకాలే మూవీతో తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈమె కుక్క మూవీలో చేసిన నటనకు నంది పురస్కారం లభించింది. నటిగా శకుంతల ఎంతోమందికి డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలో కూడా సెట్ లో నేర్పించేవారట. ఇక చివరి రోజుల్లో ఆరోగ్య కారణాలు ఆమెను చాల ఇబ్బంది పెట్టాయి. అయితే ఓరోజు శకుంతలను విజయశాంతి పిలిపించుకుని తెలంగాణా యాస గురించి సందేహాలు నివృత్తి చేసుకుందట.

ఆసమయంలో శాకుంతల తాను పడుతున్న అనారోగ్య ఇబ్బందులను ప్రస్తావిస్తూ సరిగ్గా డబ్బులు లేక పడుతున్న బాధలను వివరించడంతో తనదగ్గర ఉన్న డబ్బుల్లో ఓ కట్ట తీసి శకుంతల చేతిలో విజయశాంతి ఉంచారట. తర్వాత రోజుల్లో ఈవిషయాన్ని శకుంతల ప్రస్తావిస్తూ విజయశాంతి చేసిన సాయాన్ని గుర్తుచేసుకునేది. అయితే 2014 జూన్ 14న తన ఇంటిలో శకుంతల గుండెపోటుతో కన్నుమూసింది.