Movies

పెళ్లి విషయంలో నయనతార కండీషన్స్ – లవర్ కి దిమ్మతిరిగింది

కొందరు హీరోయిన్స్ ఓ రేంజ్ లో ఉండగానే పెళ్ళిచేసుకుని సెటిల్ అయిపోతారు. ఇక సమంత లాంటివాళ్లు పెళ్లయ్యాక కూడా తమ కెరీర్ కొనసాగిస్తారు. హీరోయిన్స్ లవ్ లో పడడం,పెళ్లిళ్లు చేసుకోవడం షరా మామూలే. ఇక కోలీవుడ్‌, టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకు పోతున్న ముద్దుగుమ్మ నయనతార మాత్రం అయితే కెరీర్‌ ఇంత పీక్స్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకోవడం అతి పెద్ద తప్పుడు నిర్ణయంగా భావిస్తుంది. ప్రస్తుతం విఘ్నేష్‌ శివన్‌తో లవ్ సీన్ కొనసాగిస్తోంది. దీంతో పెళ్లి చేసుకునేందుకు సిద్దం అవుతున్నారు అంటూ చాలా నెలలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

నయన్‌ ఒక వైపు హీరోయిన్‌గా తెలుగు/ తమిళంలోకూడా వరుస చిత్రాలతో చాలా బిజీగా ఉంది. పైగా ఏదో చిన్నా చితకా చిత్రాలు కూడా కాకుండా స్టార్‌ హీరోలతో, అందునా భారీ బడ్జెట్‌ చిత్రాలు చేస్తోంది. అందుకే ఒక వైపు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమను కంటిన్యూ చేస్తూనే సినీ కెరీర్‌ను కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటోందట. ఎందుకంటే,సౌత్‌ లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా ఈ అమ్మడు గుర్తింపు తెచ్చుకుంది. అందుకే సినిమాలను వదిలేసేందుకు మనసు ఆమెకు ఒప్పుకోవడం లేదు.

అయితే విఘ్నేష్‌తో నయన్‌ చెన్నైలో సహజీవనం చేస్తున్నట్లు మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే వీరిద్దరి పెళ్లి ఇప్పట్లో అయ్యే అవకాశం కనిపించడం లేదు. నయనతారను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా అని ఎదురు చూస్తున్న విఘ్నేష్‌ శివన్‌కు అదుగో ఇదుగో అంటూ దాటవేస్తోందట. తాజాగా నయన్‌ పెళ్లి విషయమై క్లారిటీ ఇస్తూ సినిమాలతో సెంచరీ కొడితేనే పెళ్లి అంటోంది.

ఇప్పటి వరకు 60 సినిమాల్లో నటించిన తాను మరో 40 సినిమాల్లో నటిస్తే, సినిమాల సంఖ్య 100 పూర్తవుతుంది. అప్పుడే పెళ్లికి సిద్దం అంటోంది. అప్పటి వరకు కేవలం ప్రేమ/ సహజీవనమే అంటూ విఘ్నేష్‌ శివన్‌కు నయన్‌ కండీషన్ పెట్టిందట. నయన్‌ నిర్ణయంతో విఘ్నేష్‌ కి దిమ్మతిరిగిందట. ఇంకా 40సినిమాలు చేయాలా అప్పుడా పెళ్లి అంటూ విస్తుపోతున్నాడట.