బాలకృష్ణ కండిషన్స్ తో షాక్ అయినా బోయపాటి… పాపం బోయపాటి?
ఎన్ని హిట్స్ కొడితే ఏమిటి, ఒక్కటి ఫట్ అయితే చాలు సదరు డైరెక్టర్ కి తిప్పలే. ఇప్పుడు వినయ విధేయ రామ డిజాస్టర్ తో బోయపాటి శ్రీనుకి అదే జరిగింది. సంక్రాంతికి అట్టహాసంగా భారీ అంచనాల నడుమ వచ్చిన ఈమూవీ రామ్ చరణ్ కెరీర్ లో పెద్ద డిజాస్టర్ గా అయింది. దాదాపు 30కోట్ల రూపాయల వరకూ బయ్యర్లు నష్టపోయారు. దీంతో చెర్రీ రాసిన బహిరంగ లేఖ బోయపాటిని ఉద్దేశించిందేనని అంటున్నారు. టార్గెట్ బోయపాటి కావడంతో అతనితో కమిట్ అయిన నిర్మాతలందరూ ఒక్కక్కరు జారిపోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో బోయపాటి సినిమా ఉంటుందని అనుకున్నారు. అది డ్రాప్ అయింది. ఇలా ఒక్కొక్కరు జర్క్ ఇస్తుండడంతో బోయపాటికి బాలయ్య మాత్రమే అండగా నిలబడ్డాడు. బోయపాటి డైరెక్షన్ లో సినిమా చేస్తానన్న మాటకు కట్టుబడ్డాడు. అయితే బోయపాటి అంచనాలకు మాత్రం బాలయ్య చెక్ చెబుతున్నాడట.
భారీ తారాగణంతో తీయబోయే ఈ సినిమాకు ఏకంగా 70కోట్ల బడ్జెట్ ప్రతిపాదించడంతో బాలయ్య షాక్ అయ్యాడట. అసలే ఎన్టీఆర్ కథానాయకుడితో నష్ఠాల బొప్పి కట్టిన బాలయ్య ఇంత బడ్జెట్ ఎందుకని,అయినా ఇలాంటి సమయంలో ఇంతపెద్ద బడ్జెట్ శ్రేయస్కరం కాదని చెప్పేశాడట. పైగా షూటింగ్ కూడా అప్పుడే పట్టాలెక్కించవద్దని కూడా చెప్పినట్లు టాక్. ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది.
ఇప్పటికే టీడీపీ నుంచి బాలయ్యకు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఇప్పటివరకూ భారీ బడ్జెట్ లకు అలవాటు పడ్డ బోయపాటి అందుకు తగ్గట్టుగా అంచనాలు వేసుకున్నాడు. అయితే భారీ బడ్జెట్ వలన మార్కెటింగ్ సమస్యలు ఉత్పన్నం అవుతాయని, అందుకే 50కోట్ల బడ్జెట్ తోనే పూర్తిచేయాలని బాలయ్య స్పష్టం గా చెప్పాడట. ఇలా బాలయ్య విధించిన షరతులతో ఏం చేయాలో, ఎక్కడ తగ్గించాలో తెలీక బోయపాటి తలపట్టుకున్నాడట. ఇక సినిమా కూడా ఎన్నికల అనంతరం కావడంతో నిరాశలో బోయపాటి ఉన్నాడట.