Movies

జక్కన్న ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడట – వైరల్ అయిన న్యూస్

తెలుగు, హిందీ , తమిళ ఇలా ఏ సినీ ఇండ‌స్ట్రీ తీసుకున్నా ఇప్ప‌టికే చాలా మంది వార‌సులు వచ్చారు. హీరోల వారసులే కాదు ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల త‌న‌యులు కూడా హీరోల‌వుతున్నారు. కొందరు నిలదొక్కుకుంటుంటే మరికొందరు సైడ్ అయిపోతున్నారు. అయితే ఫ్యామిలీ మొత్తం సినిమా రంగం మీద దృష్టి సారిస్తూ స్టార్ వ్యాల్యూ ఆకాశ‌మంత ఉన్న రాజ‌మౌళి కుటుంబం నుంచి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు న‌టులు రాలేదు.

కేవలం దర్శకులు మాత్రమే వచ్చారు. ఇంకా చెప్పాలంటే, రచయితలు, గాయకులు ఇలా అంతా టెక్నీషియన్లే వ‌చ్చారు. అయితే హీరో లేడ‌నే లోటును భ‌ర్తీ చేయ‌డానికి ఆ ఫ్యామిలీ నుంచి కూడా ఓ వార‌సుడు వ‌చ్చేస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కానుంద ని అంటున్నారు. ఈ వార్త వైరల్ అయింది.

అయితే జక్కన్న ఇంటినుంచి అనగానే అంతా కార్తికేయ అనుకోవడం సహజం. కానీ అక్క‌డ మ‌రో హీరో కూడా ఉన్నాడు. ఆయ‌నే సింహా.. సింహా కోడూరి. ఈ పేరు పెద్ద‌గా వినిపించకపోవచ్చు. ఎందుకంటే, యితడు కీర‌వాణి చిన్న కొడుకు. పెద్ద త‌న‌యుడు కాల‌భైర‌వ ఇప్ప‌టికే గాయ‌కుడిగా వ‌ర‌స‌గా సూప‌ర్ హిట్ సాంగ్స్ పాడుతూ బానే సెటిల్ అయ్యాడు.

ఇప్పుడు అతడి త‌మ్ముడు సింహా మాత్రం డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ లో చేరి, సుకుమార్ ద‌గ్గ‌ర రంగ‌స్థ‌లం సినిమాకు కూడా ప‌ని చేసాడు.అంతవరకూ బానే ఉంది. ఇక డైరెక్ష‌న్ త‌ర్వాత ఇప్పుడు హీరో అవుతున్నాడు. సింహాను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నది మైత్రి మూవీ మేక‌ర్స్ కావడం విశేషం. ఈ సినిమాకు ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసార‌ని టాక్.

ఈ సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఇదే ఏడాది సింహా సినిమా విడుద‌ల కానుందని అంటున్నారు. ఈ చిత్రానికి కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నాడట. మొత్తానికి జక్కన్న ఫ్యామిలీ నుంచి ఓ హీరో కూడా ఆరంగేట్రం చేస్తున్నాడు.