త్రివిక్రమ్ గురించి హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్
తెలుగులో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ దస్త్ షో ఎంతగా క్లిక్ అయిందో చూస్తున్న ఆడియన్స్ ని బట్టి చెప్పవచ్చు. అత్యధిక టిఆర్పి రేటింగ్ తో ఇప్పటికీ నెంబర్ వన్ షోగా సాగిపోతున్న జబర్దస్త్ షో లో చాలామంది ఆర్టిస్టులు ఎదిగి,సినిమాల్లో , టివి షోల్లో మెరుస్తున్నారు. ఇక ఈ షోతో బాగా పాపులర్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే హైపర్ ఆది అని చెప్పాలి. పంచ్ ల మీద పంచ్ డైలాగులు వేయడంలో దిట్టగా పేరొందాడు. సుడిగాలి సుధీర్,అభి లాంటి సీనియర్స్ సైతం హైపర్ ఆది పంచ్ లకు పగలబడి నవ్వేస్తారు. పైగా వాళ్ళు తమ స్థానం దెబ్బతినకుండా జాగ్రత్తపడాల్సి వచ్చింది.
జబర్ దస్త్ షో లో తన డైలాగులను తానె రాసుకునే హైపర్ ఆదిని చాలామంది బుల్లితెర త్రివిక్రమ్ గా అభివర్ణిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో పంచ్ ల మీద పంచ్ లు ఎలా పేలుస్తాడో బుల్లితెరమీద ఆది కూడా అలానే అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎంత ఎగిగినా ఒదిగి వుండే హైపర్ ఆది,త్రివిక్రమ్ తో తనను పోల్చడం సంతోషమేనని, అయితే సరికొత్తగా రాయడం ఎలాగో ఆయనే నేర్పాడని ఆది సవినయంగా అంటాడు.
ఇక తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కబురు పెట్టాడని వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని హైపర్ అది క్లారిటీ ఇచ్చేసాడు. నిజానికి అ ఆ సినిమా టైం లోనే కల్సిన తాను ,మరో రెండుసార్లు కలిశానని అయితే ఆయన వద్ద పనిచేయాలని ఎప్పుడూ అడగలేదని అసలు అలాంటి గొప్ప రైటర్ కి ఎవరూ అవసరం లేదని, పైగా ఆయనే స్క్రిప్ట్ మొత్తం ఆయనే రాసుకుంటాడని చెప్పేసాడు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటున్న తాను అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్ షూట్ చేయడమే తనను జబర్దస్త్ షో వైపు నడిపించిందని హైపర్ ఆది చెప్పాడు. ఆ షూట్ చూసి అదిరే అభి కామెంట్ పెట్టడం,తర్వాత కలుద్దామని చెప్పడంతో జబర్దస్త్ షో లో ఎంట్రీకి మార్గం ఏర్పడిందని ఆది చెప్పుకొచ్చాడు.