Movies

పాపం కన్నుకొట్టిన ప్రియా పరిస్థితి చూస్తే జాలేస్తుంది …. హీరోయిన్ స్థాయి నుంచి?

ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను కొట్టిన సీన్ అందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది. ఆ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఇంటిముందు ప్రొడ్యూసర్స్ క్యూ కట్టారు. తెలుగువాళ్ళకు బాగా కనెక్ట్ అవ్వడంతో ఆమెను తెలుగులో సినిమాలకు హీరోయిన్ గా చేయమని కొందరు ప్రొడ్యూసర్స్ అడిగారు. అయితే ఆమె కొంత అత్యాశకు వెళ్లి రెమ్యునరేషన్ కోటి అడగడంతో అడ్వాన్స్ లు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆవిధంగా తన క్రేజ్ ని క్యాష్ చేసుకునే విషయంలో వెనకబడిపోయింది .

ఏదైనా చూస్తేనే కదా తెలిసేది, ప్రియా నటించిన లవర్స్ డే దారుణంగా డిజాస్టర్ అవ్వడంతో ఆమె డౌన్ అయింది. అందుకే ఆమెను తెలుగులో హీరోయిన్ గా చేయమని ఎవరూ సాహసించి అడగడం లేదు. అంతేనా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆఫర్స్ కూడా చేయడంలేదు. ఎందుకంటే ఓ స్టార్ డైరెక్టర్ ఆమెను హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాల్సిందిగా అడిగితె తెగ ఫోజు ఇచ్చేసిందట. అందుకే అలాంటి క్యారెక్టర్ అడగడానికి కూడా ఎవరూ రావడం లేదట.

ఏదైనా డౌన్ ఫాల్ స్టార్ట్ అయితే దాన్నుంచి బయటపడి సరైన నిర్ణయం తీసుకోడానికి ఆలోచన కూడా వెంటనే తట్టదని అంటుంటారు. ఇప్పుడు ప్రియా విషయంలో అదే జరుగుతోంది. అసలే ఛాన్సులు కరువైతే,దానికి తోడు హీరో చెల్లెలి క్యారెక్టర్ వేయాల్సిందిగా కబురు రావడంతో ఏం చెప్పాలో పాలుపోవడం లేదట.

ఎందుకంటే పెద్ద హీరో, స్టార్ బ్యానర్ ,కానీ సిస్టర్ పాత్ర కావడంతో కక్కలేక మింగలేక ఉందట. ఒకవేళ ఒప్పేసుకుంటే ఇకనుంచి అలాంటి కేరక్టర్స్ కే పరిమితం అయిపోతాననే భయం వెంటాడుతోందట. ఒకవేళ వదిలిస్తే,ఇక ఛాన్స్ లు రావేమోననే బెంగ ఉందట. మరి ఈ అమ్మడు ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి.