ఎన్టీఆర్ కోసం ఎంత మంది దర్శకులు ఎదురు చూస్తున్నారో తెలిస్తే షాక్
వరుస విజయాలు నమోదుచేసుకుంటూ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా రామ్ చరణ్ తో కల్సి ఆర్ ఆర్ ఆర్ మూవీలో చేస్తున్న సంగతి తెలిసిందే . మల్టీ స్టారర్ గా దాదాపు 300కోట్ల రూపాయల వ్యయంతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ ని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో బిజీగా ఉన్న తారక్ కోసం పలువురు డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో సినిమాకోసం రెడీ అవుతున్న తారక్ ఆతర్వాత చేసే చేయబోయే సినిమాలకోసం డైరెక్టర్ల లిస్ట్ పెరిగిపోతోంది. అర్జున్ రెడ్డి మూవీతో ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా తో ఒక మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఎఫ్ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడితో స్వయంగా కళ్యాణ్ రామ్ నిర్మించబోయే ఓ మూవీ జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడని అంటున్నారు. ఇక పెళ్లిచూపులు మూవీతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఆతర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ అనే మూవీ చేసాడు. అయితే తరుణ్ భాస్కర్ ఈమధ్య జూనియర్ ఎన్టీఆర్ ని కలిసినట్టు కల్సినట్టు వార్తలు వస్తున్నాయి.
కథే హీరో అనే విధంగా తరుణ్ భాస్కర్ చెప్పుకొస్తే,అంతావిన్నాక తన అభిమానులను దృష్టిలో పెట్టుకోవాలని తారక్ సూచిస్తూ కొన్ని చిన్నమార్పులు సూచించాడట ఎన్ని చెప్పుకున్నా ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీ డైరెక్టర్ జక్కన్న దగ్గరనుంచి బయటకు రావాలంటే కనీసం ఏడాదిన్నర అయినా పడుతుందని అంటున్నారు. ఇక అప్పుడు ఎవరి మూవీ చేస్తాడా అని ఆలోచిస్తే సుకుమార్,సందీప్ వంగా, తరుణ్ భాస్కర్ లతో పాటు ఇంకా ఎవరైనా రావచ్చు కూడా. మరి ఎవరితో ఎన్టీఆర్ ముందుగా సినిమా చేస్తారో ఇప్పుడు చెప్పలేం. మరి అంతవరకూ ఈ నిర్మాతలు ఆగుతారా లేదో చూడాలి.