ఎనిమిదేళ్లు ఇంటికి దూరమైనా షకలక శంకర్…. కారణం తెలిస్తే షాక్ అవుతారు
ఒక మనిషిలో టాలెంట్ , ఆర్ట్ ఉంటె అది ఎప్పటికైనా ఏదో రూపంలో రాణిస్తుందని అంటారు. అందుకు తార్కాణం షకలక శంకర్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల లో పుట్టి సినిమాల మోజులో హైదరాబాద్ వచ్చేసి,ఆఫీస్ బాయ్ గా సినీ జీవితం స్టార్ట్ చేసి స్టార్ అయ్యాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే దేవుడుగా భావించే శంకర్ పవన్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధం అంటాడు. బొమ్మలు అచ్చుగుద్దినట్టు వేయగల దిట్ట. శంకర్ కి ఒక అక్క,ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. తండ్రి పత్తి వ్యాపారం చేసేవాడు. ఆర్ధిక స్థోమత లేని కారణంగా 10వ తరగతిలో చదువు ఆపేసి ఓ వ్యక్తి దగ్గర పెయింటింగ్ నేర్చుకున్నాడు. జబర్దస్త్ షోతో షకలక శంకర్ గా మారిన శంకర్ సొంత ఊళ్ళో పెయింటర్ గా చేసాడు. హోటల్ లో పనిచేసాడు. 2000లో హైదరాబాద్ వచ్చేసి,ఫ్రెండ్స్ దగ్గర ఉంటూ నాలుగేళ్లు పెయింటింగ్ పనులు చేసాడు.
నటి నిర్మల దగ్గర కొన్నాళ్ళు పనిచేసాడు. అక్కడ నుంచి డైరెక్టర్ వివి వినాయక్,ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి,రచయిత కోన వెంకట్, డైరెక్ట హరీష్ శంకర్, కాళీ దగ్గర ఆఫీస్ బాయ్ గా పనిచేసాడు. సినిమాల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇదే మంచి దారి అనుకున్నాడు. వినాయక్ ఇంట్లో వంట చేసేవాడట. నల్లమలుపు బుజ్జికి అయితే ఆయిల్ కూడా పట్టేవాడట.
ఇక బుజ్జి ఆఫీస్ దగ్గర శంకర్ ని చూసిన చలాకి చంటి చూసి ఓ షో చేస్తున్నాం వస్తావా అని అడగడంతో వెంటనే ఒప్పుకుని జబర్ దస్త్ లో ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో చంటి టీమ్ లో చేసి, రామ్ గోపాల్ వర్మ లా నటించి అందరినీ అలరించాడు. ఆతర్వాత సొంతంగా టీమ్ కట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ షో చేస్తూనే సినిమాల్లో కామెడీ వేషాలు కూడా వేసేవాడు.
ఇక తన టీమ్ లో శంభో శంకర డైరెక్టర్ శ్రీధర్, వంటివాళ్లను ఈ షోలో కి తీసుకొచ్చాడు. కవ్వింత, ఓంకార్ డైరెక్షన్ లో రాజు గారి గది సినిమాల్లో నటించి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. సర్ధార్ గబ్బర్ సింగ్, ఆనందో బ్రహ్మ, గరం గరం,రైట్ రైట్,బంతిపూల జానకి,నందిని నర్సింగ్ హోమ్,వంటి మూవీస్ లో నటించాడు. రన్ రాజా రన్ , ఎక్స్ప్రెస్ రాజా,కోన వెంకట్ రచించిన గీతాంజలి వంటి మూవీస్ లో కూడా నటించాడు.
ఇక కొన్ని రోజులు ఎవరూ ఛాన్స్ ఇవ్వకపోవడంతో జబర్దస్త్ కి తాను పరిచయం చేసిన డైరెక్టర్ శ్రీధర్ దర్శకత్వంలో శంభో శంకర్ మూవీ లో హీరోగా నటిస్తూ,2018లో సొంతంగా తీసి సక్సెస్ కొట్టాడు. ఇక తన మరదలు పార్వతిని అరసవిల్లిలో చాలా నిరాడంబరంగా పెళ్ళాడి,ఆదా చేసిన డబ్బుతో పేదలకు పుస్తకాలూ, క్రికెట్ కిట్స్ అందించాడు.
తన అన్నయ్య పిల్లలను హైదరాబాద్ తీసుకెళ్లి చదివిస్తున్న శంకర్ 2000లో హైదరాబద్ వచ్చేసిన తర్వాత ఎనిమిదేళ్లు ఇంటికి ఉత్తరం కూడా రాయడం గానీ, ఫోన్ చేయడం గానీ చేయలేదట. ఇక చచ్చిపోయాడనుకుని ఫోటో కూడా పెట్టేసుకున్నారట. అయితే 2008లో రాజమండ్రిలో ఒక సినిమా షూటింగ్ లో అతడి బాబాయ్ చూసి,ఇంటికి విషయం అందించాడట. ఇప్పుడు పేరెంట్స్ కూడా శంకర్ దగ్గరే ఉన్నారు.