Movies

తన ఇంటి ఓనర్ నే టాప్ విలన్ గా మార్చిన కోడి రామకృష్ణ….ఎవరో తెలుసా?

తెలుగు చిత్ర సీమలో కేవలం నలుగురు మాత్రమే శతాధిక చిత్రాలు డైరెక్ట్ చేస్తే, అందులో ఒకడైన కోడి రామకృష్ణ మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. తన గురువు దాసరి మాదిరిగా వంద చిత్రాలు చేసారు. దాదాపు 120సినిమాలు డైరెక్షన్ చేసిన కోడి రామకృష్ణ తొలిచిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీ వినోదానికి కొత్త అర్ధం ఇచ్చింది. చిరంజీవి కెరీర్ లో బ్రేక్ ఇచ్చిన ఈమూవీ అప్పట్లో 525రోజులు ఆడింది. దాదాపు అందరు హీరోలకు హిట్స్ ఇచ్చారు. కొందరికి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టారు.

కోడి రామకృష్ణ 120సినిమాల్లో 100హిట్ అయ్యాయంటే అయన ఘనత గురించి వేరే చెప్పక్కర్లేదు. కాగా కోడి మరణం పట్ల ప్రముఖ రచయిత,నటుడు పరుచూరి గోపాలకృష్ణ చలించిపోతూ, తన ఆప్త మిత్రుడి మరణం తట్టుకోలేక పోయాయన్నారు. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన తరంగిణి సినిమాకు తాము కూడా పనిచేయాల్సి ఉన్నప్పటికీ వీలుపడలేదన్నారు. విలన్స్ గా ఉన్నవాళ్లను సైతం హీరోను చేసిన ఘనత కోడి రామకృష్ణకు దక్కుతుందని పేర్కొన్నారు. కాగా గొల్లపూడి మారుతీరావు కి సినీ లైఫ్ ఇచ్చిన ఘనత కోడి రామకృష్ణ గా ఆయన పేర్కొన్నారు.

ఓ సాధారణ వ్యక్తిని భయంకరమైన విలన్ గా చూపించిన ఘనత కోడి రామకృష్ణకు దక్కుతుందన్నారు. డాక్టర్ రాజశేఖర్ తో అంకుశం చిత్రం తీయాలనుకున్నప్పుడు విలన్ ఎవరో తేలకపోయేసరికి వెంటనే ఇంటి ఓనర్ కి స్క్రీన్ టెస్ట్ చేయించారు. ఆయనే రామిరెడ్డి. ఓ ఉర్దూ పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న రామిరెడ్డిని తిరుగులేని విలన్ గా చేసిన స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఇక అంకుశంలో రామిరెడ్డి విలనిజం చూసి ఆడియన్స్ భయపడ్డారంటే దానికి కోడి రామకృష్ణ చేసిన డైరెక్షన్ కారణం. అంతేకాదు, అమ్మోరు మూవీలో రామిరెడ్డికి మంచి పాత్రను కూడా ఇచ్చారు.