Movies

నటుడు బ్రహ్మాజీ గురించి నమ్మలేని నిజాలు….బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

తెలుగులో సింధూరం చిత్రంలో హీరోల్లో ఒకడిగా ఎంట్రీ ఇచ్చి, నెగెటివ్ రోల్స్,కామెడీ రోల్స్ తో కూడా మెప్పించగల నటుడు బ్రహ్మాజీ 1965ఆగస్టు 9న జన్మించాడు. ఇతడి పూర్తిపేరు సత్య వెంకట సుబ్రహ్మణ్య బ్రహ్మాజీరావు. అయితే సింపుల్ గా బ్రహ్మాజీ అని అందరూ పిలవడంతో వెండితెరపై కూడా అదేపేరుతో కంటిన్యూ అయ్యాడు. నిన్నే పెళ్లాడతా, ఖడ్గం,ఏక్ నిరంజన్ , అతడు,మర్యాద రామన్న వంటి చిత్రాలలో తన నటనతో జనానికి బాగా దగ్గరయ్యాడు. డైలాగ్ డెలివరీ లో కూడా ఆరితేరాడు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన బ్రహ్మాజీ తండ్రి తహసీల్దార్ గా చేసేవారు. ఇక తల్లి అమలాపురం దగ్గర అద్దంకివారి లంక కు చెందిన వారు. బ్రహ్మాజీ కి నలుగురు అక్కలు, ఓ అన్నయ్య ఉన్నారు. ఇతడి స్టడీస్ ఏలూరులో జరిగింది.

సూపర్ స్టార్ కృష్ణ అభిమాని అయిన బ్రహ్మాజీ తమ అభిమాన హీరో సినిమా వస్తే చాలు నాలుగైదు సార్లు చూసేవాడట. ఇక శంకరాభరణం హీరో జెవి సోమయాజులుని వాళ్ళ ఊళ్ళో సన్మానిస్తుంటే,అది చూసి స్ఫూర్తిపొందాడట. చదువు అయ్యాక మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరి,నటనలో బేసిక్స్ నేర్చుకుని, మద్రాసు అడయార్ ఇనిస్టిట్యూట్ లో చేరాడు. అయితే ఎం ఏ చదవడానికి వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకి చెప్పాడట. అక్కడ కృష్ణవంశీతో కల్సి ఒకే రూమ్ లో ఉండడంతో బాగా పరిచయం ఏర్పడింది.

అందుకే కృష్ణవంశీ సిందూరం మూవీలో బ్రహ్మాజీకి హీరో వేషం ఇచ్చాడు. ఇక పోసాని కృష్ణమురళీ బ్రాహ్మజీ పక్క పక్క రూమ్స్ లోనే ఉండేవారట. దాంతో పరుచూరి బ్రదర్స్ దగ్గరకు తీసుకెళ్లాడు. దాంతో పరుచూరి బ్రదర్స్ కథ రాసిన ప్రతిసినిమాలో బ్రహ్మాజీకి ఏదోఒక వేషం దక్కేది. తమిళ, మళయాళ, హిందీ భాషల్లో నటించిన బ్రహ్మాజీ తన ఇంటికి చిత్ర బృందాన్ని పిలిచి పార్టీ ఇవ్వడంలో దిట్ట. అదేవిధంగా జనతా గ్యారేజ్ షూటింగ్ అయ్యాక వెళ్లేముందు ఎక్కడైనా సిట్టింగ్ వేద్దామని మోహన్ లాల్ అనడంతో మా ఇంటికే రండి అంటూ తీసుకెళ్లి ఇచ్చిన పార్టీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వచ్చాడు. అదీ బ్రహ్మాజీ రేంజ్.

మాస్ మహారాజా రవితేజ నిన్నే పెళ్లాడతా చిత్రం ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడంతో బ్రహ్మాజీ కి అతడితో మంచి ఫ్రెండ్ షిప్ కుదిరింది. సిందూరం లో కూడా ఇద్దరూ కలిసే చేసారు. ఇప్పటికే మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. బ్రహ్మాజీ ఓ బెంగాలీ యువతిని పెళ్లిచేసుకున్నాడు. చెన్నైలో లవ్ చేసుకుని,హైదరాబాద్ లో పెళ్లిచేసుకున్నారు. నిజానికి ఆమెకు అంతకుముందే పెళ్లి కావడం భర్తతో విబేధాలు కారణంగా విడిపోవడంతో కృష్ణవంశీ, రమ్యకృష్ణ,గుణ్ణం గంగరాజు వంటి శ్రేయోభిలాషుల నడుమ బ్రహ్మాజీ,శాశ్వతి పెళ్లి చేసుకున్నారు.

ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న మూవీలో నటిస్తున్నాడు. కాగా బ్రహ్మాజీకి సంజయ్ అనే కొడుకున్నాడు. కొడుకు పెళ్లి, ఇంద్రాక్షితో ఘనంగా చేసినప్పటికీ అది ఎంతోకాలం నిలవలేదు. కొడుకు, కోడలు విడిపోతున్నట్లు బ్రహ్మాజీ స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. ఎవరి జీవితం వాళ్ళు స్వతంత్రంగా అభివృద్ధి చేసుకుని ఎదగాలని కూడా ప్రకటించడం సెన్షేషన్ అయింది.