దివ్యభారతి సడన్ డెత్ వెనుక మిస్టరీ ఏంటో తెలుసా?
బాలీవుడ్ భామ దివ్యభారతి హిందీలో కన్నా తెలుగులోనే బాగా కనెక్ట్ అయింది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈమె తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది. బొబ్బిలి రాజా మొదలుకుని రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయింది. అన్ని సినిమాల్లో ఆమె నటన, గ్లామర్ యువతను ఉర్రూతలూగించింది. ఇలాంటి స్టార్ హీరోయిన్ , అందగత్తె మళ్ళీ తెలుగులో కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఈమె సడన్ గా మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె చిన్నవయస్సులోనే పెళ్లి చేసుకుని సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఇక 19ఏళ్లకే నూరేళ్ళ జీవితం పూర్తిచేసేసి, అభిమానులను కలవరానికి గురిచేసింది. అయితే చనిపోయేముందు ఈమె ఎవరితో పార్టీ చేసుకుందో తెలిస్తే షాకవుతారు.
ముంబయిలోని తన బాల్కనీ నుంచి పడిపోయి మరణించిన దివ్యభారతి గురించి వచ్చినన్ని కథనాలు మరెవ్వరిపై రాలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఆమె భర్త,నిర్మాత సాజిద్ ను అనుమానిస్తూ ఎన్నో వార్తలు వచ్చాయి. మరెన్నో కథనాలు వెలువడ్డాయి. ఫిబ్రవరి 25న పుట్టిన ఆమె మరణం మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే ఓ నేషనల్ మీడియాలో వచ్చిన తాజా కథనం ప్రకారం చెన్నైలో ఓ షూటింగ్ లో పాల్గొని సాయంత్రానికి ముంబై చేరింది.
అక్కడ ఓ బాలీవుడ్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటే ,అలసట కారణంగా రద్దు చేసుకుంది. పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ నీతూ లుల్లాతో ఏదో ఓ విషయం చర్చించాలని ఇంటికి పిలిపించింది. ఆమె భర్త సైకియాట్రిస్ట్ శ్యాం ను కూడా ఆహ్వానించింది. వీళ్ళు తరచూ ఫామిలీ పార్టీ చేసుకోవడం అలవాటు. ఈసారి కూడా మందు పార్టీ సిద్ధం చేసుకున్నారు. ఇక వంటవాళ్లు కూడా వంట సిద్ధం చేస్తున్నారు. దివ్యభారతి మాత్రం బాల్కనీ గోడపై కూర్చుంది. శ్యాం,నీతూ హాల్లో టివి చూస్తున్నారు.
అప్పటికే అందరూ మందు మత్తులో ఉన్నారు. బాల్కనీ గోడ మీద అటునుంచి ఇటు తిరిగేసరికి అదుపు తప్పి ఐదవ అంతస్తు నుంచి దివ్యభారతి కింద పడిపోయింది. బలమైన గాయాలు కావడంతో కొనఊపిరితో గల ఆమెను ఫామిలీ మెంబర్స్ హుటాహుటీన హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఆమె ప్రాణాలు విడిచింది. అపార్ట్ మెంట్ లో అన్నింటికీ గ్రిల్స్ ఉంటే ,దివ్యభారతి ఫ్లాట్ లో మాత్రం గ్రిల్స్ లేవు. ఆమె ఫ్లాట్ కిందనే కార్ పార్కింగ్ ఉంటుంది.
ప్రతిరోజూ నాలుగైదు కార్లు పార్కింగ్ చేస్తుంటారు. ఆరోజు ఒక్క కారు కూడా లేకపోవటంతో , బాల్కనీ నుంచి పడిపోయి,గట్టిగా దెబ్బలు తగలడంతో మృత్యువాత పడింది. అయితే ఆమె తండ్రి ఈ విషయంపై మాట్లాడుతూ, ‘అరగంటకు ఎంత తాగేస్తారండి,అందుకే మద్యం మత్తులో చనిపోయిందని చెప్పలేను. అయితే ఎవరిపై తమకు అనుమానం లేదు. అంతా మా దురదృష్టం. ఆమె ప్రమాదవశాత్తూ మరణించిందని అనుకుంటున్నాం’ అని వివరించారు.