సింగర్ గీతా మాధురి గురించి అసలు నిజాలు…. ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
నచ్చావులే మూవీలో ‘నిన్నే నిన్నే కోరి’ పాటతో జనం మనసు దోచేయడమే కాదు నంది పురస్కారం కూడా అందుకున్న సింగర్ గీతా మాధురి ఇటు క్లాస్,అటు మాస్ సాంగ్స్ తో చెలరేగిపోతోంది. బిగ్ బాస్ షోలో కూడా తన ఫెరఫార్మెన్స్ తో అదరగొట్టింది. ఈటీవీలో సై సింగర్స్ ఛాలెంజ్ లో ఫైనలిస్ట్ గా నిల్చిన ఈమె చిన్నప్పుడు ఎయిర్ హోస్టెస్ అవుదామని అనుకున్నా సింగర్ అయింది. చిరుత, రేసుగుర్రం,శ్రీమంతుడు మూవీస్ లో పాడిన పాటలకు మాస్ ఆడియన్స్ నీరాజనం పట్టారు. 1985ఆగస్టు25న ప్రభాకరరావు,లక్ష్మి దంపతులకు ఏకైక సంతానంగా జన్మించిన గీతా తండ్రి ఎస్ బి హెచ్ బ్యాంకు లో మేనేజర్ గా చేసారు. పాలకొల్లుకి చెందినప్పటికీ తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు.
కొచ్చెర్లకోట పద్మావతి,రంగాచార్యులు దగ్గర మ్యూజిక్ మొదలు పెట్టిన ఈమె లలిత సంగీత శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. హీరో ఆనంద కృష్ణ నంద్ ని గీతా హైదరాబాద్ నాగోలులో పెళ్లిచేసుకుంది. 100%లవ్ మూవీలో అజిత్ గా ప్రాచుర్యం పొందిన నందు పెళ్లి చూపులు, ఎందుకో ఏమో,ఐస్ క్రీమ్ వంటి చిత్రాల్లో చేసాడు. ఇక ఇతడితో కల్సి ఓ షార్ట్ ఫిలిం లో గీతా చేసింది. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. అలా పెద్దలకు వరకూ వెళ్లి వాళ్ళ గ్రీన్ సిగ్నల్ తో ఒకటయ్యారు.
కులశేఖర్ రాసిన ప్రేమలేఖ సినిమాలోని ఓ పాటను పాడి సినీ రంగ ప్రవేశం చేసిన గీతా ఎన్నో పాటలతో అలరిస్తోంది. చిరుత మూవీలో చం కే చం కే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏక్ నిరంజన్ మూవీలో గుండెల్లో ఏదో అలజడి సాంగ్ తో క్లాస్ ఆడియన్స్ ని మెప్పించింది. దాదాపు 500పాటల వరకూ పాడిన గీతా సాంగ్స్ లో జనతా గారేజ్ లో నేను పక్కా లోకల్ పాట, గరుడ వేగాలో డియోడియో పాట, మిర్చిలో డార్లింగే సాంగ్ ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి.
సంక్రాంతి స్పెషల్,ఉగాది స్పెషల్,బతుకమ్మ స్పెషల్ సాంగ్స్ కూడా పాడిన గీతా ఈటివి స్వరాభిషేకంలో చేసింది. బిగ్ బాస్ రియాల్టీ షో లో చేసి ఆకట్టుకున్నప్పటికీ సింగర్ గా తెచ్చుకున్న పేరులో కొంత కోల్పోయిందని చెప్పాలి. 2008లో నచ్చావులే సినిమాలో సాంగ్ కి బెస్ట్ సింగర్ గా అవార్డు అందుకుంది. 2017లో జనతా గారేజ్ లో నేను పక్కా లోకల్ సాంగ్ కి ఐఫా అవార్డు గెలుచుకుంది.
బాహుబలిలో బెస్ట్ ఫీమేల్ సింగర్ గా ఐఫా అవార్డు అందుకుంది. కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీలో సాంగ్ కి బెస్ట్ ఫీమేల్ సింగర్ గా సైమా అవార్డు గెల్చుకుంది. 2014లో ఇద్దరమ్మాయిలతో మూవీలో టాప్ లేచిపోద్ది సాంగ్ కి సైమా అవార్డు అందుకుంది. ఇలా ఎన్నో అవార్డులు అందుకున్న గీతా టాప్ మోస్ట్ సింగర్ లలో ఒకరుగా రాణిస్తోంది.