Movies

యాంకర్ వర్షిణి అసలు కథ ఇదే… ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

ఒకప్పుడు కంటే ఇప్పుడు యాంకర్స్ కూడా కొత్తదనం పరుచుకుంటున్నారు. హీరోయిన్స్ ని తలదన్నేలా యాంకర్స్ అందం ,అభినయంతో సత్తా చాటుతున్నారు. దీంతో వెండితెర ను మించి బుల్లితెరపై యాంకర్స్ వలన కళాకాంతులు ఉట్టిపడుతున్నాయి. ఢీ డాన్స్ రియాల్టీ షో ద్వారా పేరుతెచ్చుకున్న ఈమె మోడల్ గా కూడా రాణించి , సినిమాల్లోనూ నటించింది. ఢీ డాన్స్ రియాల్టీ షో లో సుడిగాలి సుధీర్ తో కల్సి చేస్తున్న యాంకరింగ్ బాగా పండుతుందని విమర్శకులు సైతం అంటారు. చందమామ కథలతో తన జీవిత ప్రస్థానం మొదలుపెట్టిన వర్షిణి కి మంచి పేరువచ్చింది. ఇది జాతీయ అవార్డు కూడా పొందిన చిత్రం.

చూడగానే హిందీ హీరోయిన్ లా స్లిమ్ గా ఉండే వర్షిణి, లవర్స్, కాయ్ రాజా కాయ్ , బెస్ట్ యాక్ట్రస్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఈమె అసలు పేరు షామిలి సౌందర రాజన్. ఈ పేరుతోనే మొదట్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ కుటుంబం అయినప్పటికీ చాలాకాలం క్రితం హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. అక్కడే స్టడీస్ పూర్తయ్యాయి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఈమె కాలేజ్ డేస్ లో కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనేది.

అలా ఆమె ఫోటోలు చూసి మోడలింగ్ లో ఛాన్స్ లు ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైర్ బుల్ పర్సన్ లిస్టులో వర్షిణి కి థర్డ్ ప్లేస్ వచ్చింది. వర్షిణి కన్నా రేష్మి నాలుగడుల దూరంలో ఉంది. ఇక వర్షిణి మోడలింగ్ గా పనిచేసే సమయంలోనే సినీ ఛాన్స్ లు అందిపుచ్చుకుంది. శంభో శివ శంభో చిత్రంలో చాలా చిన్న పాత్ర పోషించింది. సినిమాల్లో ఛాన్స్ లు కష్టమని భావించిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరను వెతుక్కుంటూ వెళ్ళింది.

అలా వర్షిణి పేరుతొ టివి రంగం లో ఆమెకు బాగా కల్సి వచ్చిందని చెబుతారు. బెస్ట్ యాక్టర్స్ డైరెక్టర్ అరుణ్ పవార్ తో లవ్ ఎఫైర్ లో నిండా మునిగింది. చాలాకాలం డేటింగ్ కూడా చేశారు. పెళ్లి పీటల వరకూ యవ్వారం వచ్చినా, కొన్ని అనుకోని కారణాలవలన విడిపోయారు. సోషల్ మీడియా స్టేట్స్ లో సింగిల్ అని చూపిస్తోంది.

పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ తో ఆన్ లైన్ లో ఆమె పేరు మారుమోగింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మల్లిక్ రామ్ డైరెక్షన్ లో పెళ్లిగోల లేటెస్ట్ సిరీస్ లో కూడా నటిస్తోంది. నిజానికి సినిమాల కంటే ఢీ యాంకర్ గా తిరుగులేని పేరు వచ్చింది.