Movies

చలాకి చంటి అసలు కథ ఇదే…జబర్దస్త్ కి రాకముందు ఏమి చేసేవాడో తెలుసా?

జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా పాపులర్ అయి,సినిమాల్లో నటిస్తూ ,కొన్ని టివి షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న చలాకి చంటి అసలు పేరు వినయ్ మోహన్. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన చంటి హైదరాబాద్ లో జన్మించాడు. ఇతడికి ఇద్దరు సోదరులున్నారు. అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగిన చంటి పదవతరగతి రెండేళ్లు చదివాడు. ఇంటర్ సకాలంలో పూర్తిచేనప్పటికీ బికాం లో చేరిన చంటి ఆర్ధిక ఇబ్బందుల వలన డిగ్రీ పూర్తిచేయలేదు. ఇక షూటింగ్ కి లేట్ గా వస్తాడని,డబ్బులకోసం గొడవ పడతాడని, తమిళ వ్యక్తినని ఇలా ఎన్నో రకాలుగా ఇతడిపై సినీ ఇండస్ట్రీలో రకరకాల పుకార్లున్నాయి. కొంతమంది తమకు ఛాన్స్ లు వస్తాయన్న ఉద్దేశ్యంతో ఇతరులను బ్లేమ్ చేస్తూ తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటున్నారని చంటి అంటాడు.

డిగ్రీ చదివేరోజుల్లో క్రెడిట్ కార్డ్స్ ఇస్తామని బ్యాంకు పోస్టర్స్ గోడకు అంటించే పని చేసిన చంటి ఆతర్వాత టాటా ఇండికాం లో చేరాడు. గెస్ట్ హౌస్ మేనేజర్ గా చేసాడు. అదేసమయంలో రేడియో మిర్చిలో ఉద్యోగాలు పడ్డాయని మిత్రుడు చెప్పడంతో ఇంటర్యూకి వెళ్లి, RJ గా చేరి,చలాకి చంటిగా పేరు మార్చుకుని పాపులర్ అయ్యాడు. టూరిజంలో మిమిక్రీ చేస్తూ, సినిమాల్లో ఛాన్స్ ల కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు.

అయితే ఈలోగా యతిరాజు భూపాల్ అనే వ్యక్తి ఇచ్చిన అఫర్ తో రెండేళ్లు చంటి బంటి ప్రోగ్రాం చేసాడు. ఆతర్వాత యతిరాజు,ఇచ్చిన ఛాన్స్ తో జల్లు సినిమాలో కేరక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ, ఎం ఎస్ నారాయణ చొరవతో డైలాగ్ డెలివరీ నేర్చుకున్నాడు. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్ళీ కష్ఠాలు మొదలయ్యాయి. ఆతర్వాత విశ్వప్రయత్నం తర్వాత భీమిలి కబడ్డీ జట్టు మూవీలో ఛాన్స్ దక్కింది.

ఆ సినిమాతో గుర్తింపు వచ్చినా ఛాన్స్ లు రాలేదు. పుకార్లు కూడా అతడిపై వ్యాపించాయి. ఏడాది తర్వాత ప్రేమకావాలి సినిమాలో ఛాన్స్ దక్కింది. వీడు తేడా, ఎస్ ఎం ఎస్,లవ్ జంక్షన్ , నిన్ను చూసాక,వంటి సినిమాలు చేసినా, ముక్కుసూటి తత్త్వం వలన మళ్ళీ ఛాన్స్ లు రాలేదు. యూట్యూబ్ లో వదల బొమ్మాళి కామెడీ స్కిట్ చేసి పేరు తెచ్చుకున్నాడు. దీంతో శ్యాం ప్రసాద్ రెడ్డి పిలిచి జబర్దస్త్ షోలో ఛాన్స్ ఇచ్చాడు. పలురకాల స్కిట్స్ తో అలరించాడు చంటి.

ఇక అదేసమయంలో సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి. అయ్యో రామ, రొమాన్స్ విత్ ఫైనాన్స్ వంటి మూవీస్ చేసాడు. హీరోగా, విలన్ గా చేయాలనే కోరిక గల చంటి కృషి,పట్టుదలతో ఎదిగాడు. ఇక జబర్దస్త్ ప్రోగ్రాం లో తనను చూసిన ఓ అమ్మాయి తననే పెళ్లాడతానని ఇంట్లో చెప్పడం , ఆ ఇంట్లో వాళ్ళు తనకు ఫోన్ చేయడంతో ఒప్పుకున్నానని అలా పెళ్లయిన తనకు ఓ కూతురు కూడా పుట్టిందని చంటి చెప్పుకొచ్చాడు.