Movies

పెళ్లి దాక వచ్చి విడిపోయిన ప్రేమ జంటలు

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. అది నిజమే మరి అంటారు మన పెద్దలు. పెళ్లి అనేది నూరేళ్ళ పంట అన్నారు అందుకే. ఇక లవ్ చేసుకున్నాక ,పెళ్ళిపీటల వరకూ వచ్చి ఆగిపోయిన సెలబ్రిటీలు చాలామందే వున్నారు. అందులో కొన్ని జంటలను పరిశీలిస్తే, లవ్ స్టోరీస్ తో దూసుకొచ్చిన యువ హీరో ఉదయ్ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత లవ్ చేసుకోవడంతో ఇద్దరికే పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం కూడా చేసారు. ఇద్దరూ కొన్ని రోజులకే విడిపోయారు. విష్ణు ప్రసాద్ అనే వ్యాపారవేత్తను సుస్మిత పెళ్లాడగా, విషితను ఉదయ్ పెళ్లిచేసుకున్నాడు.

చెన్నై బ్యూటీ త్రిష, వరుణ్ ఒకరికోసం ఒకరు పుట్టామని అనుకున్నారు. షికార్లు తిరిగి,ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పాలన్న విషయంపై గొడవపడి విడిపోయారు. హీరోయిన్ బిందు మాధవితో డేట్ లో ఉండగా, హీరోయిన్ త్రిష సినిమాలతో బిజీగా గడిపేస్తోంది.

పాలబుగ్గల సుందరి గా పేరొందిన హీరోయిన్ హన్సిక ,తమిళ హీరో శింబుతో ప్రేమాయణం నడిపింది. శింబు లేని జీవితం వ్యర్థం అనుకున్న హన్సిక త్వరలోనే పెళ్లాడాలని నిర్ణయించుకుంది. ఏమైందో ఏమో గానీ ఇద్దరూ ఒకరినొకరు తిట్లతో ఆడిపోసుకుంటున్నారు.

ప్రభుదేవా కు పెళ్లయినప్పటికీ హీరోయిన్ నయనతారను లవ్ చేసాడు. పెళ్ళిచేసుకోవాలని అనుకున్నారు. అయితే ఏమైందో ఏమోగానీ ఇద్దరూ విడిపోవడం ఇప్పటికే మిస్టరీగానే ఉంది. బాలివుడ్ లో అక్షయ కుమార్,శిల్పాశెట్టి ఎంతోఘాఢంగా లవ్ చేసుకున్నారు. పెళ్లెప్పుడని ఈ జంటను అందరూ అడిగేవారు.

అయితే ఏమైందో ఏమోగానీ డింపుల్ కపాడియా కూతురుని పెళ్లాడాల్సి వచ్చింది. అయితే శిల్పాశెట్టి మాత్రం వ్యాపారవేత్త రాజ్ కుందా ను పెళ్లిచేసుకుంది.

నువ్వులేక నేను లేక మూవీలో నటిస్తున్న సందర్బంగా ఆర్తి అగర్వాల్ ,తరుణ్ మధ్య ప్రేమ చిగురించింది. జీవితాంతం కల్సి జీవించాలన్న వీరికల కలగానే మిగిలిపోయింది.