మైకేల్ జాక్సన్ ఇల్లు వేల ఎకరాల్లో – ప్రత్యేకతలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
రెండు దశాబ్దాల క్రితం ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలిగించిన మైకేల్ జాక్సన్ ఈ భూమిమీద పాప్ రారాజుగా వెలుగు వెలిగి, వివాదాస్పదంగా మరణించిన విషయం తెల్సిందే. అతడు సంపాదించుకున్న ఒకే ఒక్క ఆస్తి ఆయన ఇల్లు ఇప్పటికీ మిగిలి ఉంది. ఆయన అంటే మ్యూజిక్ అభిమానులు పడి చచ్చేవారు. అతడి పాటల కోసం, అతడిని చూసేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసిన వారు కూడా ఉన్నారు. దేశాల అధినేతల నుండి సామాన్యుల వరకు అంతా కూడా మైఖేల్ ను అభిమానించారు. చిన్న పిల్లలను అత్యంత నీచంగా లైంగికంగా వేదించాడంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు – డబ్బు అంతా మంచులా కరిగి పోయాయి.
సాదారణంగా ఇల్లు అంటే పేద వాడికి వంద గజాల్లో ఉంటుంది. బాగా డబ్బున్న రాజకీయ నాయకుడికి లేదా వ్యాపారస్తుడికి ఒకటి లేదా రెండు మూడు ఎకరాల్లో ఇల్లు ఉంటుంది. కాని మైకేల్ జాక్సన్‌కు మాత్రం 2700 ఎకరాల్లో ఇల్లు ఉంది. అది ఇల్లు అంటే అలాంటి ఇలాంటి ఇల్లు కాదు. ఆ మొత్తం సామ్రాజ్యం కూడా మైకేల్ నిర్మించుకున్నాడు. తన ఇంటి ఆవరణలో జూ, పార్క్‌లు, చిన్న పెద్ద థియేటర్లు ఎన్నో ఏర్పాటు చేయించుకున్నాడు.
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఇల్లుగా మైకేల్ జాక్సన్ ఇల్లు అయిన నెవర్ ల్యాండ్‌కు గుర్తింపు పొందింది. ప్రతి వారం పేద పిల్లలకు అక్కడ ఉచితంగా ప్రవేశం కల్పించి జూ, పార్క్, థియేటర్లలో సినిమాలు చూపించే వారు.అయితే మైకేల్ మంచి మనసుతో చేస్తే కొందరు మాత్రం పిల్లలను అక్కడకు రప్పించుకుని, వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు అంటూ ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.
అలా మైకేల్ జాక్సన్ పతనం ప్రారంభం అయ్యింది. నెవర్ ల్యాండ్ ప్రాభవం కోల్పోవడం మొదలు అయ్యింది. మైకేల్ జాక్సన్ మరణంకు ముందు నెవర్ ల్యాండ్ విలువ వేల కోట్లలో ఉండేది. కాని ప్రస్తుతం నెవర్ ల్యాండ్‌ను కేవలం 220 కోట్లకు ఒక వ్యక్తి దక్కించుకునేందుకు సిద్దం అయ్యాడు. 2015వ సంవత్సరంలో నెవర్ ల్యాండ్‌ను వేలం వేసేందుకు సిద్దం అవ్వగా 640 కోట్ల రూపాయల ధరకు వచ్చింది.
అయితే అప్పుడు ఆ రేటు తక్కువగా భావించారు. రోజు రోజుకు మైకేల్ జాక్సన్ ఇల్లు ప్రాభవం కోల్పోవడంతో పాటు, దారుణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక ఆ ఇంటిని ఆధీనంలో ఉంచుకున్న బ్యాంకులు జప్తుకు సిద్దం అయ్యాయి. విలాసాలకు, నెవర్ ల్యాండ్ మెయింటెన్స్ కు మైకేల్ భారీ ఎత్తున ఖర్చు చేయడంతో అప్పుల పాలయ్యాడు. ఇక అతడి మరణం అత్యంత వివాదాస్పదం అయింది.