Movies

RRR లో ఎన్టీఆర్ పాత్ర ఏమిటో తెలుసా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే….!

బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ తో ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న మూవీ ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్. నిజానికి ఇది టైటిల్ కాదు. వర్కింగ్ టైటిల్ మాత్రమే. యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలున్నాయి. బ్రిటిష్ కాలం నాటి సంఘటనలతో పిరిడియకల్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది.
ఈ మూవీలో తారక్ పాత్ర రెండు విభిన్న పాత్రలను కల్గి ఉంటుందని, ఒక లుక్ లో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేయగా, సెకండ్ లుక్ మూడవ షెడ్యూల్ లో తీసారట.

ఇందుకోసం తారక్ మరికొంత బాడీ పెంచేపనిలో పడ్డాడట. కొత్త కోణంలో తారక్ ని చూపించాలని తపిస్తున్న రాజమౌళి ఇందులో ఎక్కడా రాజీ పడ్డం లేదని అంటున్నారు. ఈ సినిమాలో పాత్ర ద్వారా విలన్ షేడ్ కూడా ఎన్టీఆర్ లో కనిపించబోతున్నట్లు టాలివుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ మూవీలో అడవిదొంగగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు ఇప్పటికే ఓ ప్రచారం ఊపందుకుంది. అందుకే కొన్ని సన్నివేశాల్లో స్మార్ట్ గా, కొన్ని సన్నివేశాల్లో బాడీ బిల్డర్ గా కనిపించబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు బాలీవుడ్ కి ఎన్టీఆర్ ని పరిచయం చేయడానికి ఓ ప్రత్యేక ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నట్లు టాక్. మొత్తానికి తన సినిమాలో ఏదో ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ ని చూపించే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తో ఎలాంటి సెన్షేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.