లక్ష్మీస్ ఎన్టీఆర్…. బాబు మాస్టర్ ప్లాన్… వర్మ ఏమి చేస్తాడో?
ఎన్టీఆర్ బయోపిక్‌లు రెండూ అంతగా ప్రేక్షకుల ఆదరణ చూరగొనలేదు. దీంతో జనం ఫోకస్ అంతా వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీపైనే ఉంది. అయితే ఈ మూవీ విడుదలను ఎలాగైనా ఆపాలని చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి మొదటి అడ్డంకి సెన్సార్ బోర్డ్ అంటున్నారు. సెన్సార్ దగ్గరే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అడ్డుగోడ కట్టేయాలని చూస్తున్నారు చంద్రబాబు.
తెలుగుదేశం పార్టీపేరు, పార్టీ సింబల్ వాడటంపై అభ్యంతరం తెలుపుతున్నారు. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఉన్న సన్నివేశాలు, డైలాగులను వెంటనే తొలగించాలనే డిమాండ్ తెరమీదకు వస్తోంది.
రక్తచరిత్ర సమయంలో కూడా సెన్సార్ కత్తెర నుంచి తప్పించుకోడానికి ఊరి పేర్లతో సహా మొత్తం పాత్రల పేర్లనే మార్చేశారు రామ్ గోపాల్ వర్మ. అసలైన పాత్రలు గుర్తుకొచ్చేలా, కాస్త దగ్గరగా పోలిన పేర్లను పెట్టి కవర్ చేశారు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరగబోతోంది. ముఖ్యంగా టీడీపీ గుర్తు అయిన సైకిల్‌ని రిక్షాలా మార్చి చూపిస్తున్నారు వర్మ.
తెలుగుదేశం పార్టీకి కూడా కొనసాగింపుగా కొత్త పదాన్ని జతచేయబోతున్నారు. తాజాగా విడుదలైన వర్కింగ్ స్టిల్స్ లో రిక్షా గుర్తు బయటకు వచ్చింది. దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్ సహా.. సినిమాలో మిగతా పాత్రల పేర్లన్నీ మారిపోతాయి. వెన్నుపోటు బాబుతో సహా.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా మార్చేస్తారు. లక్ష్మీపార్వతి అభ్యంతరం చెప్పరు కాబట్టి అక్కడ కాసింత స్వేచ్ఛ తీసుకున్నారు. చంద్రబాబుకి దిమ్మతిరిగేలా మూవీని విడుదలచేయడానికి వర్మ మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించబోతున్నారు.