Movies

మహేష్ బాబుకి నో చెప్పిన హీరోయిన్…..షాక్ లో అభిమానులు

సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్స్‌ పెద్ద హీరోల సరసన యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. పెద్ద హీరోల సరసన నటిస్తే తొందరగా స్టార్ డమ్ అందుకోవచ్చనేది చాలా మంది హీరోయన్స్ ప్లాన్ చేస్తుంటారు. అందుకే పెద్ద హీరోల సరసన కథానాయికగా ఎపుడు ఛాన్స్ వస్తుందా ఎదురు చూస్తుంటారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా చాన్స్ వచ్చిందంటే ఏ కథానాయిక అయిన ఎగిరి గంతేస్తుంది. కానీ సాయి పల్లవి మాత్రం రాక రాక మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వచ్చినా..క్యారెక్టర్ నచ్చక ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్టు సమాచారం.

ప్రస్తుతం మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ సినిమా ఉండాల్సింది. కానీ వీళ్లిద్దరి మధ్య కథ విషయంలో క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఈ ప్రాజెక్ట్ కాన్సిల్ అయింది. దీంతో మహేష్ బాబు..ఎఫ్ 2 మూవీతో వరుసగా నాలుగు సక్సెస్‌లు అందుకున్న అనిల్ రావిపూడితో పుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టేనర్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా దూకుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు.

ఈ సినిమా మే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి, రష్మిక మందన్నలు అనుకున్నారు. కానీ ఈ సినిమాలో యాక్ట్ చేసేందకు సాయి పల్లవి నో చెప్పిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. సాయి పల్లవి కథ నచ్చితేనే ఏ సినిమానైనా యాక్సెప్ట్ చేస్తోంది. స్టార్ డమ్, కాంబినేషన్ చూసి సినిమా ఒప్పుకునే రకం కాదు. ఆమెకు సినిమాలో పాత్ర నచ్చితేనే ఓకే చెబుతుంది.

రీసెంట్‌గా ఆమె ముఖ్యపాత్రలో నటించిన ‘పడి పడి లేచే మనసు’, ‘మారి 2’ అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేకపోయాయి. తాజాగా అనిల్ రావిపూడితో మహేష్ బాబు చేస్తోన్న కథలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ఏమైనా లేక లేక సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశం వచ్చినా… కథలో పాత్ర నచ్చక సాయి పల్లవి నో చెప్పడం ఇపుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది.