మహేష్ చేయబోయే నెక్ట్స్ సినిమా రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సినిమా సినిమాకు స్టార్ హీరోలు, హీరోయిన్స్ రెమ్యునరేషన్ పెంచేస్తున్నట్టు వింటున్నాం. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చి 15 కి కంప్లీట్ అవుతుందట. ఈ ‘మహర్షి’ సినిమా ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్టు ఇది వరకే డిక్లేరు చేసారు. అయితే కానీ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా మే 9 రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి ఏ డేట్ అనేది తొందర్లోనే అఫీషియల్ ప్రకటించాల్సి ఉంది. ‘మహర్షి’ తర్వాత సుకుమార్‌తో మహేష్ సినిమా ఉండాల్సింది. కానీ ఈ సినిమా క్యాన్సిల్ కావడంతో మహేష్ బాబు..నెక్ట్స్ ఏ డైరెక్టర్‌తో సినిమా చేయనున్నాడనే విషయమై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ మారింది.
సుకుమార్ పక్కకు తప్పుకోవడంతో మహేష్ నెక్ట్స్ మూవీ అనిల్ రావిపూడితో దాదాపు ఖరారైంది. ఈ సంక్రాంతికి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘ఎఫ్ 2’తో అనిల్ రావిపూడి సంచలన విజయం అందుకున్నాడు. ఈ సినిమాకు ముందు చేసిన పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్’ వంటి సినిమాలు కూడా వరుసగా సక్సెస్ సాధించడంతో మహేష్,తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అనిల్ రావిపూడి డైరెక్షన్ లో పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టేనర్ చేయాలని ఫిక్స్ అయినట్టు టాక్.
‘మహర్షి’ సినిమా కంప్లీటైన తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా పట్టాలెక్కానుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి సెన్షేషన్ అయింది. అనిల్ రావిపూడితో చేయబోయే సినిమా విడుదలకు ముందే జియో టీవీ రూ.50 కోట్లకు అన్ని భాషలకు కలిపి డిజిటల్ రైట్స్ ఆఫర్ చేసిందంట. ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ డిజిటల్ రైట్స్ రూపంలో రావడంతో విడుదలకు ముందే నిర్మాత దిల్ రాజు సేఫ్ అవుతున్నాడు.
ఈ సినిమాకు ‘వాట్సాప్’అనే టైటిల్ ని పెట్టాలని భావిస్తున్నారట. మరోవైపు ‘దూకుడు 2’ అనే పేరు పెడితే ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోందట. ఇప్పటికే దిల్ రాజు ఈ టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించాడు. అయితే ఈమూవీ కోసం మహేష్ బాబు దాదాపు రూ. 50 కోట్లు చార్జ్ చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇక ఈ సినిమా బడ్జెట్ మరో రూ.50 కోట్లు ఉంటుందని అంటున్నారు.