బాహుబలి చెంప పగలకొట్టిన అభిమాని… ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
బాహుబలి మూవీతో వరల్డ్ వైడ్ గా ప్రభాస్ కి గుర్తింపు వచ్చేసింది. తదుపరి చిత్రంగా సాహో చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీలో అల్ట్రా స్టైలిష్ లుక్ తో ప్రభాస్ దర్శనం ఇవ్వబోతున్నాడట. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మేకింగ్ వీడియో రెండవది విడుదల చేసారు. మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఆవిధంగా సోషల్ మీడియాలో ఈ వీడియో దూసుకెళ్తోంది. ఈ వీడియో చూస్తే కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని చెప్పవచ్చు. వచ్చే ఆగస్టు 15న ఆడియన్స్ ముందుకు ఈ మూవీ రాబోతోంది.
సాహు తర్వాత మూవీగా రాధాకృష్ణ డైరెక్షన్ లో మూవీ స్టార్ట్ చేసేసిన ప్రభాస్, పూర్తి సమయాన్ని ఆ మూవీకోసం కేటాయించనున్నాడట. మూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఈ మూవీలో పూజా హెగ్డే నటిస్తోంది. ఇంతగా ప్రభాస్ దూసుకెళ్తుంటే అతడికి ఫాన్స్ నుంచి చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఒక్కోసారి అవి హద్దులు కూడా దాటున్నాయి. ఎక్కడ ప్రభాస్ దర్శనం ఇచ్చినా అక్కడ ఫాన్స్ మీద పడిపోతున్నారు. కంట్రోల్ చేయడం కష్ట సాధ్యం అవుతోంది.
ఇక ఇటీవల విదేశాల్లోని ఓ విమానాశ్రయంలో ప్రభాస్ కి ఎదురైన ఘటన చాలా షాక్ కి గురిచేసింది. అక్కడున్న ఓ మహిళా అభిమాని ప్రభాస్ దగ్గరకొచ్చి ఫోటో తీయించుకుంటానని అడగడంతో సరేనన్నాడు. ఆమె ఫోటో దిగేసి, సంతోషంతో గంతులేసింది. అక్కడితో వదలకుండా వెళ్ళిపోతూ ప్రభాస్ చెంప మీద కొట్టేసి మరీ వెళ్ళింది. సరదాగానే జరిగినప్పటికీ ప్రభాస్ షాకయ్యాడు.
మిగిలిన హీరోలు కూడా ఇందుకు సంబంధించిన వీడియో చూసి షాక్ తిన్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. అక్కడ ఉన్నది ఇండియన్ యువతి కనుక సరిపోయిందని, వేరే వాళ్ళు ఇలా చేస్తే ఏమయ్యేదని అందరి నుంచి వినిపించే మాట.