న్యూ లుక్ తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న మెగా సుప్రీం హీరో!
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకొని మామకి తగ్గ అల్లుడు అనిపించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. ఈ యువ హీరో కెరియర్ లో ఎంత వేగంగా హైప్ క్రియేట్ చేసుకున్నాడో, అంతే వేగంగా వరుసగా ఐదు ఫ్లాప్ సినిమాలతో కెరియర్ లో బ్యాక్ కి పడిపోయాడు. అయితే ప్రస్తుతం ఈ మెగా హీరో కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి అనే సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు.
ఇదిలా వుంటే తేజ్ ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు అనే టాక్ ఆ మధ్య వినిపించింది. అయితే అతని లుక్ ఎలా వుంటుంది అనే విషయంలో మాత్రం ఇన్ని రోజులు క్లారిటీ లేదు. ఇదిలా వుంటే తాజాగా తేజ్ తన ట్విట్టర్ ఎకౌంటులో గెడ్డం లుక్ తో స్టైలిష్ గా దర్శనం ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ గెడ్డంతో సూపర్ హిట్స్ కొట్టారు. ఈ నేపధ్యంలో తేజ్ కూడా అలాంటి గెటప్ తోనే ఎలా అయిన హిట్ కొట్టాలనే కసితో వున్నట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఇప్పటి వరకు రెగ్యులర్ గా కనిపించిన తేజ్ మొదటి సారి డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది.