Movies

అలనాటి క్లాసిక్ మూవీ టైటిల్స్ దెబ్బతీస్తున్న యంగ్ హీరోలు

తెలుగులో గానీ, హిందీలో గాని,తమిళం లో గానీ ఒక్కోసారి ఒక్కో రకమైన ట్రెండ్ నడుస్తుంది. ఒక సినిమా హిట్ అయితే చాలు, దానికి సీక్వెల్ తీయడమో గానీ, అదే సినిమా ను ఇతర లాంగ్వేజ్ లోకి రీమేక్ చేయడమో చేస్తుంటారు. కానీ ఇప్పుడు హిట్ అయిన ఓల్డ్ సినిమా టైటిల్స్‌ను పెట్టి, సక్సెస్ కొట్టేయాలని మన దర్శకులు చూస్తున్నారు. ఈ ట్రెండ్ ఈ మధ్య మరి ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి సినిమాకు టైటిల్ ఒక పెద్ద అసెట్. అదే.. సినిమాను సగం విజయాన్ని తెచ్చిపెడుతుంది. అందరికి తెలిసిన పేర్లు పెట్టడమో లేక.. కొత్త పేర్లను సృష్టించడమో చేస్తారు కానీ,ఈ మధ్య సూపర్ హిట్ అయిన సినిమాల టైటిల్ కొత్త మూవీలకు పెట్టడం సహజంగా మారింది. ఇలా పెట్టడం వలన ఓల్డ్ టైటిల్స్ ఇమేజ్ ని కొందరు దెబ్బతీస్తున్నారు.

అడవిరాముడు,శంకరాభరణం,నర్తన శాల వంటి టైటిల్స్ వాడేసుకుని వాటికి డామేజ్ చేసేలా కొత్త సినిమాలు ఉంటున్నాయి. దీంతో ఫలానా సినిమా పోయిందని చెప్పడానికి కూడా ఎబ్బెట్టుగా ఉంటోంది. అంతేకాదు, అంతకుముందు నాగార్జున, నాని హీరోలుగా వచ్చిన ‘దేవదాస్’ కూడా ఒకప్పటి అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ దేవదాసును కొంచెం ఛేంజ్ చేసి పెట్టేసారు. గ‌తంలో వేణుమాధ‌వ్ “ప్రేమాభిషేకం”.. “భూకైలాస్” లాంటి క్లాసిక్స్ ముట్టుకుని నాశ‌నం చేసాడు.

ఇలాంటి టైటిల్స్ వాడుకుని వాటి విలువ తీసి, విజ‌యం రాక‌పోగా విమ‌ర్శ‌లు కూడా మూటకట్టుకున్నాడు. తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ పెట్టేసారు. పేరు బాగానే ఉన్నా మెగా ఫ్యాన్స్ మాత్రం నాని ని ఓ ఆట ఆడుకుంటున్నారు. నువ్వు గ్యాంగ్ లీడర్ ఏంటి ? ఇప్పటికీ ఎప్పటికీ గ్యాంగ్ లీడర్ అంటే చిరంజీవి అంటూ నానిపై ట్రోల్స్ వేస్తున్నారు.

మరోవైపు చిరంజీవి పాత సూపర్ హిట్ ‘ఖైదీ’ సినిమా టైటిల్‌ను కొత్త మూవీకి పెట్టుకోవాలని హీరో కార్తి కూడా చూస్తున్నాడు. దీనిపై మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో రియాక్ట్ అవుతారో చూడాలి.ఈ రెండు సినిమాలు తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టికీ నిలిచిపోయే సినిమాలు కదా. ఇలాంటి సినిమాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని క్రిటిక్స్ సైతం అంటున్నారు.