Politics

ఎప్పుడు పవన్ పక్కన ఉండే నాదెండ్ల మనోహర్ గురించి అసలు నిజాలు ఇవే

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ఐటి విప్లవం రావడానికి మనోహర్ ప్రధాన కారణం అని చెప్పాలి. ఎమ్మెల్యేలకు లాప్ టాప్ లు,ట్యాబు ల వాడకం ప్రవేశపెట్టింది కూడా ఈయనే. అసెంబ్లీలో వైఫై కూడా ప్రవేశపెట్టారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కీలకంగా మారారు. గతంలో గుంటూరు జిల్లా తెనాలి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ఎవరితో వివాదాలు లేకుండా మంచి నేతగా పేరొందారు. జనసేనలో పార్టీ వ్యవహారాల్లో పవన్ కి అన్ని విధాలా సహాయసహకారాలు మనోహర్ అందిస్తున్నారు.

జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు కూడా అయిన మనోహర్ నేషనల్ లెవెల్లో ఎన్నో టోర్నమెంట్స్ లో పాల్గొన్నాడు. 1986 లో నేషనల్ లెవెల్లో కాంస్య పతాకం సాధించారు. విదేశాల్లో కూడా టెన్నిస్ పోటీల్లో పాల్గొని తన సత్తా చాటారు. యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి,యువతను పార్టీవైపు ఆకర్షించేలా చేయడంలో కృషి చేసారు.

2004లో తొలిసారి తెనాలి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009లో మరోసారి గెలిచి తనపట్టు సాధించారు. మొదట్లో డిప్యూటీ స్పీకర్ గా చేసారు. అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అవ్వడంతో మనోహర్ స్పీకర్ అయ్యారు. ప్రస్తుతం జనసేనలో పవన్ కి కుడిభుజంగా వ్యవహరిస్తున్న మనోహర్ కి గల రాజకీయ అనుభవం,సభ అనుభవం దృష్టిలో ఉంచుకుని పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు.

ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే మనోహర్ కి డిప్యూటీ సీఎం,హోమ్ మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర సంచలనం సృష్టించిన నాదెండ్ల భాస్కరరావు తనయుడైన మనోహర్ 1964ఏప్రియల్ 6న జన్మించారు. నిజాం కాలేజీ నుంచి బిఎ పూర్తిచేసి,ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసారు.

ఈయన భార్య పేరు డాక్టర్ మనోహరం. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే మనోహర్ కి అన్ని విషయాల్లో పట్టుంది. విద్యావంతుడు,సౌమ్యుడు కావడంతో పవన్ కళ్యాణ్ ఎంతో విలువ ఇస్తూ, గౌరవిస్తున్నారు.