Movies

ప్రభాస్ సాహో సినిమా గురించి 10 ఆసక్తికర విషయాలు

1) అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూడవ చిత్రంగా ‘సాహో’ చిత్రం రూపొందుతుంది.

2) తెలుగు,తమిళ, హిందీ భాషలలో ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న ఈ మూడు బాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు.

3) సినిమా మేకింగ్ విజువల్స్ ను షేడ్స్ ఆఫ్ సాహో అనే పేరుతో ఇప్పటివరకు రెండు చాఫ్టర్స్ గా విడుదల చేశారు. ప్రభాస్ బర్త్ డే పురస్కరించుకుని మొదటి చాప్టర్ ను అక్టోబర్ 23 న విడుదల చేశారు.

4) రెండవ చాప్టర్ ను హీరోయిన్ శ్రద్ధా కపూర్ బర్త్ డే సందర్భంగా మార్చి 3 న విడుదల చేశారు. చాప్టర్ 2 టీజర్ విడుదలైన అతి తక్కువ కాలంలోనే హైయెస్ట్ వ్యూస్ ను సాధించి సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

5) చాప్టర్ 1 కు బ్యాగ్రౌండ్ స్కోర్ థమన్ అందించగా.. చాప్టర్ 2 కు జిబ్రాన్ మ్యూజిక్ అందించారు. ఇక ఫీచర్ సినిమాకు శంకర్ ఎహసాన్ లాయ్ లు సంగీతం అందిస్తున్నారు.

6) బాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రద్ధా కపూర్, ఈ సినిమాతో దక్షిణాదిలో అడుగుపెట్టబోతుంది. గాయకురాలుగా, మోడల్ గా, నటిగా ఎంతో పేరు సంపాదించిన శ్రద్ధా తొలిసారిగా ప్రభాస్ సరసన నటించడంతో సినిమాపై హైప్ ను మరింత పెంచింది.

7) కేవలం హీరోకి ఉన్న ఇమేజ్ దృష్ట్యా దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ పెట్టడం అనేది.. దర్శక నిర్మాతలకు సినిమాపై ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది. అయితే ఈ సినిమాను బాహుబలి కి ముందే అనుకున్నారట. అప్పుడు ఇంత బడ్జెట్ కూడా అనుకోలేదట. అప్పటికే బాహుబలి సినిమాకు ప్రభాస్ మూడేళ్లు కేటాయించడంతో ఇప్పుడు చేయాల్సి వచ్చింది. బాహుబలి తరువాత ప్రభాస్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను పెంచుకుంటూ వెళ్లారట యువి క్రియేషన్స్ నిర్మాతలు.

8) ఇక దర్శకుడి గురించి చెప్పాలంటే ఆయన ఇంతకుముందు ఇంత హై బడ్జెట్ మూవీ తెరకెక్కించలేదు. పెద్ద హీరోలతో కూడా సినిమా చేసింది లేదు. కేవలం ‘రన్ రాజా రన్’ అనే ఒక్క సినిమాకు దర్శకత్వం వహించిన సుజీత్ కు ‘సాహో’ ప్రాజెక్ట్ అప్పగించడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సినిమా టీజర్స్ చూశాక ఇప్పుడు ప్రభాస్ డెసిషన్ కు అందరు ‘సాహో’ అంటున్నారు.

9) సాహో సినిమా హిందీ, తమిళ్ లో కూడా విడుదలవుతున్న నేపథ్యంలో చాలా మంది పరభాషా నటులు ఇందులో కనిపించనున్నారు. బాలీవుడ్ నుండి మందిరా బేడీ, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, ఎవెలిన్ శర్మ నటిస్తుండగా.. తమిళ్ నుండి అరుణ్ విజయ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

10) సాహో సినిమాలో భారతీయ సినిమాలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 20 నిమిషాల పాటు కంటిన్యూస్ గా భారీ యాక్షన్ ఎపిసోడ్ కనువిందు చేయనుంది. ఈ ఎపిసోడ్ ను దుబాయ్ లో భారీ ఖర్చు పెట్టి చిత్రీకరించారు. షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 1 లో చూసిన మేకింగ్ వీడియో దీనికి సంబంధించినదే.

చూసారుగా ఇన్ని విశేషాలతో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం సాహో తప్పకుండా ప్రభాస్ కెరీర్ లో ఒక మైలురాయిగా, భారతీయ సినిమాకు తలమానికంగా నిలుస్తుందని ఆశిద్దాం.