Movies

750కి పైగా సినిమాల్లో నటించిన 6 టాలీవుడ్ కమెడియన్లు

హీరోల విషయానికొస్తే వారసత్వంతో నెట్టుకొచ్చేస్తారు. కమెడియన్స్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి పోటీ లేకుండా ఎవరి టాలెంట్ ను వారు నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది కమెడియన్స్ 100 సినిమాలు చేస్తారు.. ఇంకొంతమంది 500 సినిమాలు చేస్తారు. కానీ 750 పైగా చిత్రాలలో నటించడం అంటే మాములు విషయం కాదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కొంతమంది మన హాస్యనటులు. ఈ నేపథ్యంలో 750 పైగా చిత్రాలలో నటించిన కొందరు ప్రముఖ హాస్య నటులను చూద్దాం.

అల్లు రామలింగయ్య

మూడు తరాల ప్రేక్షకులను తన హాస్యంతో అలరించిన హాస్యనటుడు అల్లు రామలింగయ్య. సుమారు 1000 కి పైగా చిత్రాలలో కామెడీ మరియు విలన్ పాత్రలు చేశారు. తెలుగు నటులలో 1000 చిత్రాలు పూర్తిచేసిన మొదటివ్యక్తిగా అల్లు రామలింగయ్య ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును అందుకున్న అల్లు.. తెలుగు చిత్రపరిశ్రమకు ఎనలేని సేవలందించినందుకు రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకున్నారు.

రమాప్రభ

సినిమాల్లోకి రాకముందు తమిళ నాటక రంగంలో 4000 కి పైగా రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారు రమాప్రభ. చిన్నతనం నుండే నటన మీద మక్కువతో సినీ రంగంలోకి ప్రవేశించిన రమాప్రభ ఇప్పటివరకు 1400 పైగా చిత్రాలలో నటించారు. హాస్యనటిగా పేరుగాంచిన రమాప్రభ అల్లు రామలింగయ్య, రాజబాబులకు జోడిగా అనేక చిత్రాలలో మెప్పించారు.

బ్రహ్మానందం

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, తెరపై ఈయన కనిపిస్తే చాలు ప్రేక్షకుల ముఖాన నవ్వులు పూవులు పూయాల్సిందే. ‘అహ నా పెళ్ళంట’ చిత్రంతో మొదలైన తన నట ప్రస్థానం.. ఇప్పటివరకు ఎన్న. అన్నీ భాషలలో కలిపి 1000 కి పైగా చిత్రాలలో నటించిన బ్రహ్మి గిన్నిస్ రికార్డ్ లోకి కూడా ఎక్కారు. భారత ప్రభుతం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ హాస్యనటుడిగా ఎన్నో అవార్డులు .. మరెన్నో పురస్కారాలు అందుకున్న బ్రహ్మానందంకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది.

ఆలీ

ఆలీ, ఇప్పటివరకు తెలుగు, తమిళ, హిందీ భాషలలో 1100 పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను విభిన్న పాత్రలతో అలరింపజేశాడు. ‘సీతాకోకచిలుక’ సినిమాతో బాలనటుడిగా తన నటప్రస్థానం మొదలుపెట్టిన ఆలీ.. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ నుండి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం

హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం దూరదర్శన్ లో ప్రసారమైన ఆనందోబ్రహ్మ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జంధ్యాల దర్శకత్వం వహించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాలో మొదటి అవకాశం వచ్చింది. ఇక్కడి నుండి మొదలుకుని 870 చిత్రాలలో నటించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం 2013 లో కనుమూశారు. అప్పట్లో లెక్చరర్ పాత్రలకు డైరక్టర్ల మొదటి ఆప్షన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యమే.

తనికెళ్ళ భరణి

ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి, నటుడు మాత్రమే కాదు.. స్క్రీన్ రైటర్, డైరక్టర్, నోవెలిస్ట్ కూడా. ఇప్పటివరకు తెలుగు, తమిళ, హిందీ భాషలలో విలన్ గా, కమెడియన్ గా 750 పైగా చిత్రాలలో కనిపించారు. ఈయనకు అన్ని కళలలో ప్రావీణ్యం ఉంది కనుక సకల కళాకోవిదుడు అనే బిరుదుతో పిలవబడేవాడు.