Movies

ఇంటర్నేషనల్ సెలబ్రిటీ ఎంత సింపుల్ గా ఉందో చూసారా.. ఒక్కప్పటి హీరోయిన్ .. ఆమెను గుర్తు పట్టారా?

టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన ఇంటర్నేషనల్ సెలబ్రిటీ ఈమె. చాలా సింపుల్ గా ఉండడం ఈమె నైజం. ఇక క్రీడల్లో రాణిస్తే ఇటు పేరు, అటు ఉద్యోగం కూడా వస్తాయని పలువురిని ఆమె వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఈమె ఎవరో కాదు ఒకప్పుడు పరుగుల రాణిగా వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన అశ్విని నాచప్ప. పిటి ఉష గుండెల్లో సైతం రైళ్లు పరుగెత్తించిన మహిళ. కర్ణాటక రాష్ట్ర గొలుగొప్పం అనే చిన్న గ్రామ వాసి అయిన ఈమె కు తెలుగు ఆడియన్స్ కి దగ్గర బంధం ఉంది. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై అశ్విని అనే సినిమాను ఈనాడు రామోజీ రావు తీశారు. అందులో అశ్విని నాచప్ప హీరోయిన్. మొదట్లో నటన అంటే ఆమ్మో అనేసినా,ఆతర్వాత తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇంకా చెప్పాలంటే తన బయోపిక్ లో తానె నటించిన ఏకైక క్రీడానటి ఈమె కావచ్చు.

నిజానికి 1980దశకంలో పరుగుల విభాగంలో పిటి ఉష పేరు మారుమోగేది. అయితే అశ్విని ప్రవేశంతో పిటి ఉష వెనుకబడింది. 1988లో అర్జున అవార్డు కూడా దక్కించుకున్న ఈమె అథ్లెట్స్ లో అందగత్తెగా నిల్చింది. 1992లో పిటి ఉషను ఓడించడం ద్వారా అశ్విని సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఈ సెన్షేషన్ ని సినిమాగా తీయాలని రామోజీరావు ప్రయత్నం చేసి సఫలమయ్యారు. ఆతర్వాత ఆదర్శం అనే మరో తెలుగు మూవీలో నటించి తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయింది.

ఆతర్వాత క్రీడలకు స్వస్తి చెప్పి 1994లో ఇండియన్ ఎయిర్ ల్యాండ్స్ ఆటగాడు దత్తా కరుణ్ బాయ్ ని పెళ్లాడింది. అనీషా, దీపాలి అనే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. పదవ తరగతి చదువుతున్నది అనిషా బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇక ఆరవ తరగతి చదువుతున్న దీపాలి గోల్ఫ్ సాధన చేస్తోంది. ప్రస్తుతం మెరికల్లాంటి క్రీడాకారులను తీర్చిదిద్దడంతో పాటు మహిళలపై వేధింపులకు నిరసనగా పోరాటం కూడా చేస్తోంది. సినిమాల్లో చేయమని అడిగినా, కోచ్ గా ఉండమని అడిగినా సున్నితంగా తిరస్కరించి, తన స్వగ్రామానికి సేవ చేయాలని భావించి,అక్కడొక స్కూల్ ప్రారంభించి ,ఆటల్లో కూడా శిక్షణ ఇస్తున్నారు.

ఆమె నడిపే స్కూల్ లో 560మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎక్కడ జరిగినా హాజరవుతారు. ఇక రాజకీయాల్లో అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. క్రీడల్లో కేంద్ర కార్యదర్శిగా చేసిన ఐ ఏ ఎస్ బిటివిరావు క్రీడాశాఖలో అవినీతి గురించి చెబుతూ ఇందులో పాల్గొనాలని కోరడంతో క్లిన్ స్పోర్ట్స్ ఇండియా అనే ఓ సంస్థను ఆమె నెలకొల్పారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయడమే పనిగా చెబుతుందామె. పంకజ్ అద్వానీ వంటి క్రీడాకారుల సాయంతో గ్రామాల్లో క్రీడా కుసుమాలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది.