Movies

బాబాయి, అబ్బాయి అయ్యారు .. ఇక ఆమె చిరంజీవితో….ఎవరా హీరోయిన్…?

సినిమాల్లో హీరోయిన్స్ నటన వచ్చేసరికి వింతగా ఉంటుంది. ఓ పక్క కొడుకుతో,మరోపక్క తమ్ముడితో యాక్ట్ చేసి ఇప్పడు తండ్రితో యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఇది మెగా ఫామిలీ విషయంలో ఓ స్టార్ హీరోయిన్ కి ఎదురైంది. రామ్‌ చరణ్‌ ‘ఎవడు’ చిత్రంతో పాటు, పవన్‌ కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ శృతిహాసన్‌ ఇప్పుడు చిరంజీవి 152వ చిత్రంలో నటించేందుకు కమిట్‌ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో బాబాయి, అబ్బాయిలతో నటించిన హీరోయిన్‌ ఇప్పుడు తండ్రి చిరంజీవితో నటించడం సినీ ఇండస్ట్రీలోనే రికార్డు అంటూ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అద్బుతమైన ఈ కాంబినేషన్ కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చేస్తున్నారు. ఈ మూవీ విడుదలకు ముందు తదుపరి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో మొదలు పెట్టాలని నిర్ణయించారు. ఆ చిత్రంలో చిరంజీవి డబుల్‌ రోల్‌ పోషించబోతున్నాడు. భారీ అంచనాలున్న ఆ చిత్రంకి రామ్‌ చరణ్‌ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్‌ రెడీ చేసి వెయిట్‌ చేస్తున్నాడు.

భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా శృతిహాసన్‌ను ఎంపిక చేసినట్లుగా సినీ వర్గాల లో టాక్ వినిపిస్తోంది. శృతిహాసన్‌ హీరోయిన్‌గా ఎంపిక చేసిన విషయమై అధికారికంగా ప్రకటన రాలేదు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి, కమల్‌ హాసన్‌లు మంచి ఫ్రెండ్స్. కమల్‌ హాసన్‌ కూతురుతో నటించడం ఏమాత్రం సరికాదనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ఈ విషయంలో చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. మే/ జూన్‌లో చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నిర్మాణంలో ప్రారంభం కావాల్సి ఉంది. దీనికోసం ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారట.