Movies

మ‌హేష్ బాబు కోపం ఇంకా త‌గ్గ‌లేదా….కోపం రావటానికి కారణం ఏమిటో తెలుసా?

మహర్షి సినిమా విషయంలో మహేష్ బాబు అసంతృప్తితో ఉన్నాడ‌నే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 25న విడుదల చేయాలని ముందు నుంచి కూడా మహేష్ బాబు చెబుతూనే ఉన్నాడు.అయితే వంశీ పైడిపల్లి అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయడంలో విఫలం అయ్యాడు. ఏప్రిల్ 5 నుంచి 25కు వెళ్ళినప్పుడే చిత్ర యూనిట్ కు మహేష్ బాబు క్లాస్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా మరో రెండు వారాలు వాయిదా పడటంతో ఆయన అసహనంతో ఉన్నాడు.

ఈ విషయంపై నిర్మాత దిల్ రాజుతో కూడా మహేష్ బాబు మాట్లాడినట్లు తెలుస్తోంది. దీనికి అసలు కారణం సినిమా వాయిదా పడటం కాదు.. మే నెలలో మహేష్ బాబు ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు. దాంతో అదే సెంటిమెంట్ ఇప్పుడు మహర్షి విషయంలో ఎక్కడ రిపీట్ అవుతుందోనని భయపడుతున్నాడు మహేష్ బాబు. పైగా ఇది ఆయ‌న‌కు 25వ సినిమా కావ‌డం విశేషం. అందుకే చిత్ర యూనిట్ పై అసహనంతో ఉన్నాడని తెలుస్తోంది.
Maharshi mahesh babu
మే లో వచ్చిన నాని, నిజం, బ్రహ్మోత్సవం సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో ఇప్పుడు ఇదే నెలలో మహర్షి సినిమా కూడా వస్తుండడంతో ఆయన టెన్షన్ పడుతున్నాడు. అయితే దిల్ రాజు మాత్రం మహర్షి సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కచ్చితంగా ఎమోషనల్ గా వస్తారని ఆయన అభిమానులకు మాట ఇస్తున్నాడు. సినిమాలో చాలా విషయం ఉందని రైతుల గురించి కూడా అద్భుతమైన కథ ఉందంటున్నాడు.

మే 9న ప్రపంచవ్యాప్తంగా మహర్షి సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత కచ్చితంగా మహేష్ బాబు ఇమేజ్ మరింత పెరుగుతుందని, ఆయన పర్సనల్ ఇమేజ్ ను కూడా ఇది పెంచుతుందని చెబుతున్నాడు. ఏదేమైనా సినిమా వాయిదా పడటంతో మహేష్ బాబు మాత్రం కాస్త అసంతృప్తిగా కనిపిస్తున్నాడు.