కేశినేని నాని కూతురుని చూసారా… బెజవాడ రాజకీయాల్లో సంచలనం!
ఏపీలో ఎన్నికల హడావిడి అప్పుడే స్టార్ట్ అయిపొయింది. ఓపక్క పార్టీల్లో టికెట్స్ సందడి,ఒక పార్టీలోంచి మరోపార్టీలోకి జంపింగ్ లు, ఒకరిపై ఒకరు విమర్శలు ఇలా ఎక్కడ చూసినా ఎన్నికల సంగ్రామానికి తెరలేస్తోంది. నాయకులు కూడా జనంలోకి వెళ్లి తమకు అనుకూలమైన వాతావరణాన్ని బిల్డప్ చేసుకుంటున్నారు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని గత ఎన్నికల్లో విజయవాడ నుంచి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగి ఘనవిజయం సాధించారు.
ఇక ఇప్పుడు కూడా ఎంపీ టికెట్ తిరిగి ఆయనకే ఖాయం అయినట్టే. ఈ పరిణామంలో కేశినేని నాని రెండవ కుమార్తె శ్వేతా చౌదరి స్పెషల్ ఎట్రాక్షన్ అయింది. ఈమె త్వరలో రాజకీయాల్లోకి వస్తుందన్న మాట వినిపిస్తోంది. యుఎస్ లో ఉన్నత చదువులు చదువుకున్న ఈమెకు సోషల్ సర్వీస్ మీద ఎంతో ఆసక్తి ఉంది. ఆధునిక పద్ధతుల్లో రాజకీయ ప్రచారంపై మంచి అవగాహన కూడా ఉంది. కొన్నాళ్ల క్రితం భారత్ వచ్చిన శ్వేతా ఇక్కడి రాజకీయ పరిస్థితులు స్టడీ చేస్తోంది.
ఇందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా తో కల్సి సుడిగాలి పర్యటన చేస్తోంది. ఎక్కడ చూసినా విజయవాడలో ఆమె పేరు మారుమోగిపోతోంది. తమ కుమార్తెకు ఇలా మంచి పేరు రావడం పట్ల ఎంపీ కేశినేని నాని పొంగిపోతున్నారు. ఇక 2014ఎన్నికల్లో కూడా శ్వేతా విస్తృత ప్రచారం సాగించి,ఇప్పుడు మరోసారి ప్రచారానికి రంగం సిద్ధం అయింది.
కాగా 4ఏళ్ళ క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ మెంబర్ గా పేరుతెచ్చుకుంది. హిట్లర్ క్లింటన్ టీమ్ తో కల్సి కీలక బాధ్యతలు నిర్వహించింది. డోనాల్డ్ ట్రంప్ టీమ్ తో శ్వేతా టీమ్ ఆన్ లైన్ లో హోరాహోరీగా తలపడింది. ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో హిల్లరీ ఓటమి పాలయినప్పటికీ శ్వేతా వర్కింగ్ నేచర్ కి మంచి గుర్తింపు లభించింది.