Politics

లక్ష్మి పార్వతి గురించి ఈ విషయాలు మీకు తెలుసా….నమ్మలేని నిజాలు

తెలుగునాట నందమూరి లక్ష్మీపార్వతి అంటే ఓ సంచలనం. స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలో రెండవ భార్యగా ఎంట్రీ ఇచ్చిన ఈమె వలన ఎన్టీఆర్ కి, చంద్రబాబుకి మధ్య గ్యాప్ వచ్చిందని అంటారు. ప్రస్తుతం వైస్సార్ సిపిలో ఉంటున్న ఈమె గురించి వివరాల్లోకి వెళ్తే,1962ఆగస్టు 10న తెనాలిలోకి జన్మించింది. చిన్నప్పటినుంచి చదువంటే ఈమెకు ఎంతో ఇష్టం. ఈమె తండ్రి కమ్యూనిస్ట్ భావాలతో ఉండేవారు. 9ఏళ్లప్రాయంలోనే ఈమెను హరికథా కళాకారుడు వీరగంధం వెంకట సుబ్బారావు చేరదీసాడు. హరికథలు నేర్పిస్తూనే, సంస్కృత భాషపై ఈమెకు గల పట్టుచూసి ఈమెను బాగా చదివించాడు. డిగ్రీ, పిజి చేసిన ఈమె కొన్నాళ్ళు లెక్చరర్ గా చేసింది. అయితే తనను పెళ్ళిచేసుకోవాలని లేకుంటే చనిపోతానని వత్తిడి తేవడంతో చేసేది లేక , పెళ్లయి,నలుగురు పిల్లలున్న వీరగంధం వెంకట సుబ్బారావు చివరకు లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకున్నాడట.

అయితే అచేతన అవస్థలో ఉన్న తనపై వత్తిడి పెట్టి పెళ్లిచేసుకున్నాడని ఈమె చెబుతోంది. ఏదైతేనం సుబ్బారావు,లక్ష్మీపార్వతిలకు ఓ అబ్బాయి కూడా పుట్టాడు. వీరగంధం కోటేశ్వర ప్రసాద్ మంచి పేరున్న డాక్టర్ గా స్థిరపడ్డాడు. ఇక ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు కళలను ఎక్కువగా ప్రచారంలో ఉపయోగించేవారు. అలా ప్రచారం చేయమని వీరగంధం వెంకట సుబ్బారావు ని అడిగారట. ఆవిధంగా సుబ్బారావు , లక్ష్మి పార్వతి బృందం ప్రచారం చేసేవారు. అలా ఎన్టీఆర్ తో పరిచయం ఉంది.

ఇక లక్ష్మిపార్వతి ఎంఫిల్ చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సుబ్బారావు మొదట్లో అంగీకరించలేదు. అయితే ఎంఫిల్ కోసం ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఎంచుకోవడంతో అప్పటికే భార్య చనిపోయి ఒంటరిగా అచేతనంగా గల తన జీవిత చరిత్ర ఎందుకని ఎన్టీఆర్ అన్నారట. కానీ ఎట్టకేలకు ఒప్పించి 1987లో ఎన్టీఆర్ ఇంట్లో నివసించే ఛాన్స్ కొట్టేసింది. అదేసమయంలో ఇద్దరి మధ్యా ప్రేమ అంకురించింది. ఎన్టీఆర్ పెళ్ళికి అంగీకరించడంతో వీరగంధం వెంకట సుబ్బారావు కి విషయం చెప్పి విడాకులకు ఒప్పించింది. అలా నరసారావు పేట కోర్టులో విడాకులు పొందింది.

ఇక తిరుపతిలో 1993లో సంప్రదాయంగా ఎన్టీఆర్ , లక్ష్మిపార్వతికి వివాహం జరిగింది. ఇక ఎన్టీఆర్ కుటుంబానికి ఇది ఇష్టం లేకపోవడంతో కుటుంబంతో ఇబ్బందులు వచ్చాయి. ఇక టిడిపిలో కూడా లక్ష్మీపార్వతి హవా మొదలైంది. పార్టీలో జోక్యం చేసుకోవడంతో చంద్రబాబుకి ,ఇంట్లో వాళ్లకి అసలు నచ్చలేదట. ఇక పార్టీలో టికెట్స్ ఇచ్చేదాకా ఆమె పెత్తనం ఎదిగింది. 1994లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వంలో కూడా జోక్యం పెరిగిందని ,దీంతో ఇక ఏమాత్రం నచ్చని ఎన్టీఆర్ కుటుంబం పార్టీని లాక్కోవాలని నిర్ణయించుకుందని ,అది వైస్రాయ్ హోటల్ దగ్గర ఘటనకు దారితీసిందని అంటారు.

ఎమ్మెల్యేల కాంప్ పెట్టడంతో ఎన్టీఆర్ అక్కడకు వెళ్లడం,అక్కడ చెప్పులతో ,గుడ్లతో దాడిచేయడం వంటి ఘటనలు జరిగాయి. ఆతర్వాత నాలుగు రోజులకే చంద్రబాబు సీఎం అయ్యారు. అసెంబ్లీలో సైతం ఎన్టీఆర్ మాట్లాడ్డానికి స్పీకర్ యనమల రామకృష్ణుడు ఛాన్స్ ఇవ్వకుండా చంద్రబాబు ప్రభావితం చేసాడు. ఎన్టీఆర్ వైపు నిలబడిన మోత్కుపల్లి,గాలి ముద్దుకృష్ణమ నాయుడు,బుచ్చయ్య చౌదరి వంటివాళ్ళు ఎన్టీఆర్ పక్షాన ఉన్నారు. చివరకు ఎన్టీఆర్ మరణం తర్వాత వాళ్ళు కూడా చంద్రబాబు వర్గంలో చేరిపోయారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన ఫామిలీ మెంబర్స్ ఎవరూ ఆయన్ని పట్టించుకోకుండా ఆస్తుల కోసం పాకులాడారని,ఆసమయంలో తాను ఆసరాగా ఉండడం తన తప్పా అని లక్ష్మీపార్వతి తరచూ ప్రశ్నిస్తూనే ఉంది.