ఛలో మూవీతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేదో తెలుసా?
ఛలో మూవీతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక ఆతర్వాత విజయ్ దేవరకొండలో కల్సి గీత గోవిందం మూవీతో స్టార్ హీరోయిన్ అయింది. కర్ణాటకలో సుమన్ ,మదన్ మందన్న దంపతులకు తొలిసంతానంగా 1996 ఏప్రియల్ 5న రష్మిక జన్మించింది. తండ్రి వ్యాపారవేత్త,తల్లి గృహిణి. చిన్నప్పుడు స్కూల్ లో చదివే రోజుల్లో , కాలేజీ డేస్ లో కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొని డాన్స్ చేసేది. మైసూరు యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పట్టా అందుకుంది. ఇంగ్లీషు లిటరేచర్ లో పిజి పూర్తిచేసింది. 2014లో టైమ్స్ పత్రిక నిర్వహించిన మోస్ట్ డిసైరబుల్ ఒమెన్ గా చోటు సంపాదించింది.
2016లో 24వ స్థానం సాధించి, 2017లో తొలిస్థానానికి చేరింది. కిరిక్ పార్టీ సమయంలో నటుడు రక్షిత్ శెట్టితో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. చాలారోజులు లవ్ లో మునిగితేలారు. 2017 జులై 3న పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం జరిగింది. ఈ ఎంగేజ్ మెంట్ ని రష్మిక రద్దుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 22ఏళ్ళ రష్మిక కెరీర్ మీద దృష్టి పెట్టడం కోసం నిశ్చితార్ధం రద్దుచేసుకుందన్న వార్తల సారాంశం. అయితే నిశ్చితార్ధం రద్దయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె తేల్చిచెప్పేసింది.
నిజానికి జర్నలిజం చదివే రోజుల్లో ఫ్రెండ్స్ తో కల్సి2010లో మోడలింగ్ ప్రారంభించింది. క్లిన్ అండ్ క్లియర్ ఫ్రెష్ నెస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఆతర్వాత క్లిన్ అండ్ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయింది. ఆతర్వాత బెంగుళూరు టాప్ మోడల్స్ లో ఒకరుగా టైటిల్ గెలిచింది. ఆసమయంలో ఆమె ఫోటోలు చూసిన కిరిక్ పార్టీ దర్శక నిర్మాతలు ఆ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. సినిమాల్లోకి వెళ్ళడానికి మొదట్లో ఆమె పేరెంట్స్ ఒప్పుకోకపోయినా ఆతర్వాత ఒప్పించి ఒకే చెప్పేయడంతో 2017లో కన్నడ తెరపై మెరిసింది.
నాలుగు కోట్లతో నిర్మాణమైన ఈ మూవీ నాలుగు కోట్ల వరకూ వసూళ్లు సాధించి ఆ ఏడాది బెస్ట్ ఫిలిం గా నిల్చింది. శాంతి పాత్రలో రష్మిక ప్రశంసలు అందుకుంది. సైమా అవార్డు కూడా గెలుచుకుంది. 2017లో హర్ష డైరెక్షన్ లో పునీత్ రాజ్ కుమార్ తో కల్సి అంజనీ పుత్ర మూవీలో నటించగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఆమెను అందమైన నటిగా గుర్తించింది. ఆతర్వాత చమక్ అనే కన్నడ మూవీలో హీరో గణేష్ సరసన చేసింది.
అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఖుషి పాత్రలో రష్మిక ప్రశంసలు అందుకుంది. 2017లో తెలుగులో నాగసౌర్య హీరోగా వచ్చిన సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఆతర్వాత గీత గోవిందం మూవీతో విజయ్ దేవరకొండ సరసన నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఓ పద్దతి గల అమ్మాయిగా చేసిన నటన అందరినీ ఆకట్టుకుంది. ఇక నాగార్జున, నాని నటించిన దేవదాస్ మూవీలో నానికి జోడిగా నటించింది. అయితే అది హిట్ కాలేదు.
ఇక మరోసారి విజయ్ సరసన డియర్ కామ్రేడ్ మూవీలో చేస్తోంది. కన్నడలో మరో మూవీ చేస్తోంది. కాగా జర్నలిజం చదవడం వలన యాక్టర్ కాకుండా ఉండివుంటే న్యూస్ ఛానల్స్ లో యాంకర్ గా చేసేదాన్నని చెప్పింది. ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూ సందర్బంగా కొంచెం సేపు తెలుగు వార్తలు చదివి ఆకట్టుకుంది.