తబలా మాంత్రికుడు జాకిర్ హుసేన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
చిన్నప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తబలానే తన ఆయుధంగా మలిచి భారతీయ సంగీతానికి కొత్త హంగులు అద్దిన మహనీయుడు. ఆయనే ప్రముఖ తబలా కళాకారుడు జాకిర్ హుసేన్. అప్పటికీ ఇప్పటికీ తరగని చెరగని ముద్ర వేసుకుని భారతీయ శాస్త్రీయ సంగీతంలో తన పేరును సువర్ణాక్షరాలతో లికించుకున్న మహోన్నత వ్యక్తి హుసేన్.
1. జాకిర్ హుసేన్, మార్చి 9, 1951లో జన్మించారు. ఈయన పూర్తిపేరు జాకిర్ హుసేన్ కురేషీ. హుసేన్ తండ్రి అల్లా రఖా కూడా ప్రఖ్యాత తబలా విద్వాంసుడే.
2) బాల మేధావి అయిన హుసేన్ అతని తండ్రి తనకు మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుండే పక్వాజ్ అనే సంగీత వాయిద్యాన్ని నేర్పించడం మొదలుపెట్టాడు.
3) 1969 లో అమెరికా లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో సంగీతంలో డాక్టరేట్ సాధించడానికి వెళ్లిన జాకిర్, అక్కడి నుండి సంవత్సరానికి 150 ప్రదర్శనలు దాకా ఇచ్చేవాడు.
4) 1991 లో అతని మొదటి ఆల్బమ్ విడుదల కాగా.. 1992 లో బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్ గా గ్రామీ అవార్డ్ అందుకుంది. ఈ అవార్డ్ ను ప్రపంచ సంగీత విభాగంలో మొదటిసారిగా ఇవ్వడం జరిగింది.
5) ఈ బృందం 15 సంవత్సరాల తర్వాత 2007 లో తిరిగి కలిసింది మరియు 2009 లో ఉత్తమ సమకాలీన ప్రపంచ సంగీత ఆల్బమ్ కోసం గ్రామీ అవార్డును గెలుచుకుంది.
6) జాకీర్ హుసేన్ కథక్ నర్తకి మరియు గురువైన ఆంటోనియా మిన్నెకోలా ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు అమ్మాయిలు. అనిసా కురేషీ, ఇసబెల్లా కురేషీ
7. ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలోని సంగీత విభాగంలో 2005 నుంచి 2006 మధ్యలో పూర్తిస్థాయి ఆచార్యుడిగా పనిచేసిన జాకిర్ హుసేన్ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకుడు కూడా.
8) జాకిర్ హుసేన్ తబలా విద్వంసుడే కాదు, సంగీత దర్శకుడు మరియు నటుడు కూడా. ఈయన, తాజ్ మహల్ టీ బ్రాండ్ అంబాసిడర్ గా 20 ఏళ్ళు పనిచేశారు. ఆ యాడ్ లో జాకిర్ చెప్పిన వాహ్ తాజ్ చాలా ప్రసిద్ధి పొందింది .
9) సంగీత ప్రపంచంలో ఆయనకున్న అమితమైన ప్రతిభకు భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసింది. 1999 లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు సంగీత విద్వాంసులకు ఇచ్చే నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ తో సత్కరించింది. సాంప్రదాయ కళాకారులకు మరియు సంగీతకారులకు ఇచ్చిన అత్యున్నత పురస్కారం ఇది.
10) అలాగే 1990 లో భారతదేశపు జాతీయ సంగీత, నాట్య, నాటక సంస్థ సంగీత నాటక అకాడమీ వారి పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.
11) 1988 లో భారతీయ ప్రభుత్వం చేత పద్మశ్రీ తో గౌరవింపబడ్డ అతి చిన్న వయస్కుడు జాకీర్ హుస్సేన్.
12) హుస్సేన్ మొట్టమొదటిసారిగా హీట్ అండ్ డస్ట్ (1983) చిత్రంలో నటించాడు. దీనికి సంగీతం కూడా అందించింది ఈయనే.
13. మలయాళ చిత్రం వనప్రస్థానం అనే సినిమాకు భారతీయ సంగీత సలహాదారుగా పనిచేసి, ఆ సినిమాలో నటించాడు. 1999 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం ప్రదర్శించబడింది.
ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో లో నివాసం ఉంటున్న జాకిర్ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం.