Movies

టాలీవుడ్ లిరిక్ రైటర్ శ్రేష్ఠ గురించి బయట పడ్డ నమ్మలేని నిజాలు

తెలుగు సినిమా రంగంలో ఛాన్స్ లు రావడం చాలా కష్టమే. ఎంతో కష్టపడితే గానీ ఛాన్స్ రాదు. వచ్చాక నిలబెట్టుకోవడం కోసం చాలా శ్రమించాలి. ఇక యాక్టింగ్ విభాగం కాకుండా మిగిలిన విభాగాల్లో నిలదొక్కుకోవాలన్న కష్టమే. ఇక గీత రచయితలుగా ఆడవాళ్లు చాలా తక్కువ. ఈ ఫీల్డ్ లో నిలబడాలంటే, ఆడవాళ్లు అయితే చాలా కష్టం. ఎన్నో అవమానాలు,నిందలు,వేధింపులు చవిచూడాలి. సరిగ్గా సినీ గీతరచయిత శ్రేష్ఠ విషయంలో ఇదే జరిగింది. పెళ్లిచూపులు మూవీలో చినుకు తాకే,మెరిసే మెరిసే పాటలతో ఈమెకు ఎంతో గుర్తింపు వచ్చింది. సెన్షేషనల్ మూవీ అర్జున్ రెడ్డిలో మధురమే పాట కూడా ఈమె రాసింది. ఇంకా పెళ్లికాని శ్రేష్ఠ నెమ్మది నెమ్మదిగా సినిమాల్లో దూసుకెళ్తోంది.

ఒక రొమాంటిక్ ప్రేమ కథ, కో అంటే కోటి,జబర్ దస్త్, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి మూవీస్ కి రాసినా సరే అర్జున్ రెడ్డి పాటతో టాప్ రేంజ్ కి శ్రేష్ఠ చేరింది. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన శ్రేష్ఠ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అందుకే ఎంతో గారాబంగా పెంచారు. తండ్రి వ్యాపార వేత్త,తల్లి ప్రభుత్వోద్యోగి. తల్లిదండ్రుల మతాలు వేరైనప్పటికీ ఇంట్లో కులమతాలకు అతీతంగా మసలుకుంటారు. శ్రేష్ఠ తాతదగ్గర పెరిగింది. అందుకే భక్తిగీతాలపై ఈమెకు ఇష్టం ఏర్పడింది. పదవతరగతి వచ్చేసరికి పడడమే కాదు రాయడం కూడా వచ్చేసింది. దాంతో అడపాదడపా భక్తి గీతాలు రాస్తూ తన కాలానికి పదును పెట్టింది.

మంచిర్యాలలో పదవతరగతి వరకూ చదివింది. కామర్స్ లో డిగ్రీ చేసిన ఈమె ఉస్మానియాలో లా చేసింది. సినిమాల్లో పాటలకు ఇంటినుంచి హైదరాబాద్ వచ్చేసి, ఒకరూం లో అద్దెకుండేది. రూమ్ లో కూడా ఉండలేని పరిస్థితి రావడంతో దేవాలయంలో ఉంటూ సినిమాల్లో ట్రై చేసింది. అయినా ఛాన్స్ లు రాలేదు సరికదా, ఇక ఎల్ ఎల్ బి చదువుతుండగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో క్లాస్ లు జరిగేవి కాదు. ఇక సినీ రచయిత వెన్నెలకంటి ఆమెలోని ప్రతిభను గుర్తించి ఎంకరేజ్ చేసాడు.

దాంతో తీవ్రంగా ట్రై చేసి,రొమాంటిక్ సినిమాతో 2013లో లిరిక్ రైటర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక పెళ్లి చూపులు ,అర్జున్ రెడ్డి మూవీస్ ఆమె కెరీర్ ని మలుపు తిప్పాయి. అయితే సినీ రచయితగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డానని, వేధింపులు ఎదురయ్యాయని,ఒక నిర్మాత వైఫ్ కూడా ఇందులో ఉందని ఆమె చెబుతూ కలకలం రేపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఈనాడు పత్రిక పక్షాన వసుంధర అవార్డు అందుకుంది.