Movies

మెగాస్టార్ పక్కన ఉన్న ఈ అబ్బాయి ఎవరి కొడుకో తెలుసా?

తెలుగు చలనచిత్ర రంగంలో స్వయంకృషితో ఎదిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో చాలామందికి గౌరవ మర్యాదలున్నాయి. ఎన్నో సినిమాలతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఆయా రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా ఉన్న చిరంజీవికి రాజకీయాలు అంతగా కల్సి రాలేదని చెప్పాలి. రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉండడమే ఇందుకు నిదర్శనం. అందుకే రాజకీయాల్లో సక్సెస్ సాధించలేకపోయినా సినీ రంగంలో మళ్ళీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

ప్రజారాజ్యం పార్టీ పెట్టి,ఆతర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి దాదాపు 9ఏళ్ళ విరామం తర్వాత సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150తో తన సత్తా చాటారు. కుర్ర హీరోలకు ధీటుగా స్టెప్పులేస్తూ తన స్టామినా చూపించారు. ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా నరసింహారెడ్డి మూవీ లో చిరంజీవి నటిస్తున్నారు. అది పూర్తయ్యాక కొరటాల శివ డైరెక్షన్ లో చేయనున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ , సామాజిక అంశాలు జోడించి ఓ అద్భుతమైన కథ కొరటాల సిద్ధం చేసాడట. ఇక ఆ మూవీలో డబుల్ రోల్ వేస్తున్నాడట.

అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీలో కూడా చిరంజీవి నటించబోతున్నాడట. ఈ విషయాన్నీ చిరంజీవి స్వయంగా ఇప్పటికే ప్రకటించారు. ఇక ప్రతిభావంతులను ఎంకరేజ్ చేయడంలో చిరంజీవికి మరెవ్వరూ సాటిరారు. ఇక చిరంజీవితో ఓ కుర్రాడు సెల్ఫీ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ఫోటో వెనుక కథ ఏమిటంటే, సదరు కుర్రాడు మెగాస్టార్ పర్సనల్ అసిస్టెంట్ కొడుకు.

ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసాడు. ఇందుకు చిరంజీవి ఇచ్చిన ఊతమే కారణం. ఇక ఈ అబ్బాయిలో గల టాలెంట్ ని గుర్తించి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చిరంజీవి రికమండ్ చేసాడట. దాంతో సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కల్సి టైటిల్ సాంగ్ లో తళుక్కున మెరిశాడు.