Movies

మౌనరాగం సీరియల్ హీరోయిన్ అమ్ములు గురించి షాకింగ్ విషయాలు

సినిమాల కన్నా టివి సీరియల్స్ ప్రభావం జనం మీద ఎక్కువ ఉందని చెప్పాలి. టివి సీరియల్ వస్తోందంటే జనం టీవీలకు అతుక్కుపోయారు. అందుకే ఏళ్లకు ఏళ్ళు సీరియస్ల్ జనరంజకంగా నడుస్తున్నాయి. ఇక స్టార్ మాలో ప్రసారమవుతున్న మౌనరాగం సీరియల్ కి ప్రత్యేకత ఉంది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెల్సి భార్యకు పాయిజన్ ఇవ్వడంతో పాప మూగ అమ్మాయిగా పుడుతుంది. ఇక ఈ పాత్ర పేరు అమ్ములు. సీరియల్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే దీనికి వీరలెవెల్లో క్రేజ్ వచ్చేసింది. ఎందుకంటే కళ్ళతోటే హావభావాలు పలికించగల ఛాలెంజింగ్ రోల్ అది. అలాంటి పాత్రలో ఆమె రక్తికట్టించింది.

ఇంతకీ ఈ అమ్ములు ఎవరో ఏమిటో వివరాల్లోకి వెళ్తే,అమ్ములు పాత్ర వేస్తున్న నటి పేరు ప్రియాంక జై. ఇంట్లో ఎవరూ నటులు కాకపోయినా,ఇంట్లో వాళ్లకు డ్రీమ్ ఉంటె చాలు ఆటోమేటిక్ గా పిల్లలు నటన రంగంలోకి వస్తారు. అలా చాలామంది ఉన్నారు. ప్రియాంక జై తల్లికి కూడా నటి అవ్వాలనే కోరిక ఉండేదట. 18ఏళ్ళ వయస్సు గల ఈమె పుట్టింది మహారాష్ట్ర అయినప్పటికీ స్కూల్,కాలేజ్ స్టడీస్ అన్నీ బెంగుళూరులోనే జరిగాయి.

తన హయాంలో కుటుంబం ఒప్పుకోకపోవడంతో తన కూతురు ప్రియాంకను నటిగా చేయాలని తల్లి ఫిక్స్ అయింది. అలా తల్లి ఎంకరేజ్ మెంట్,తనకు కూడా గల ఇంట్రస్ట్ కారణంగా మొదట్లో కొన్ని కన్నడ మూవీస్ లో ప్రియాంక చిన్నచిన్న పాత్రలు వేసింది. తమిళ రీమేక్ గోలి సోడా కన్నడ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.

అలాగే చల్తే ,చల్తే మూవీతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్ లో ఇక ఛాన్స్ లు రాలేదు. సరిగ్గా అదేసమయంలో మౌనరాగం సీరియల్ హీరోయిన్ అమ్ములు పాత్ర కోసం వెదుకుతున్నారు. దీంతో ప్రియాంకను ఆ పాత్ర వరించింది. ఇక ఆ పాత్రలో లీనమై నటిస్తూ తెలుగు ఆడియన్స్ ఇళ్లల్లో అభిమాన హీరోయిన్ గా స్థానం సంపాదించుకుంది.