రమ్యకృష్ణ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే…బ్రేక్ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
కేవలం 13ఏళ్ళ వయస్సులోనే ఇండస్ట్రీకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ రమ్యకృష్ణ ఎన్నో సినిమాలతో వైవిధ్యమైన పాత్రలతో టాప్ రేంజ్ కి చేరింది. గ్లామర్ పాత్రలతో యువత హృదయాలను కొల్లగొట్టింది. భలేమిత్రులు సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ఒక్కోమెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ గా ఎదిగి, బాహుబలితో వరల్డ్ వైడ్ గా మంచి పేరు తెచ్చుకుంది. శివగామి పాత్రలో ఆమె చూపిన నటన సూపర్భ్ . కృష్ణ , మాయ దంపతులకు 1970సెప్టెంబర్ 15న జన్మించిన రమ్యకృష్ణ చిన్ననాటినుంచే రంగస్థలంపై నటనతో ఆకట్టుకుంటూ ఎన్నో బహుమతులు సొంతం చేసుకుంది. సాంప్రదాయ కూచిపూడి,భరతనాట్యం నేర్చుకుని అనేకప్రదర్శలు ఇచ్చింది. చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ లో దూసుకుపోయేది.
తమిళనటుడు రామస్వామికి మేనకోడలు అయిన ఈమె తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. సినీ దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెద్దల అంగీకారంతో 2003 జూన్ 12న పెళ్లాడింది. వీరిపెళ్ళి అప్పట్లో హాట్ టాపిక్ అయింది.కృష్ణవంశీ,రమ్యకృష్ణ దంపతులకు రుత్విక్ అనే కొడుకున్నాడు. కొడుకు పేరిట కంపెనీ కూడా స్టార్ట్ చేసిన రమ్య,తెరమీద గంభీరమైన పాత్రలతో రాణిస్తున్న, తెరవెనుక చాలా సున్నితత్వం గల వ్యక్తి. తెలుగు ,తమిళ,మళయాళ కన్నడ,హిందీ భాషల్లో దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించి అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.
గ్లామర్ హీరోయిన్ గా, దురహంకారపు అమ్మాయిగా, కరుణ కురిపించే తల్లిగా, మొండి అత్తగా,ఇలా డిఫరెంట్ గా చాలెంజింగ్ పాత్రల్లో నటించి మెప్పించింది. 13వ ఏట 8వ తరగతి చదువుతుండగానే తమిళ చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చిన ఈమె 1987లో భలే మిత్రులు మూవీతో తెలుగులో పరిచయం అయింది. అయితే కొన్ని సినిమాల వరకూ ఆమెకు హిట్ రాలేదు. ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసేసారు. ఎన్నో అవమానాలు,ఆటుపోట్లు ఎదుర్కొంది.
ఇక కె విశ్వనాధ్ తీసిన సూత్ర దారులు మూవీలో రమ్యకృష్ణ తన నటనతో ఆడియన్స్ ని మెప్పించింది. ఇక కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో మోహన్ బాబు సరసన నటించిన అల్లుడు గారు మూవీ రమ్యకు బ్రేక్ ఇచ్చింది.ఆతర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన అల్లరిమొగుడు సినిమా రమ్యకృష్ణ జీవితాన్ని మలుపు తిప్పింది. గ్లామర్ హీరోయిన్ గా అందాలు వడ్డించిన ఈమె ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఘరానా బుల్లోడు,అల్లరి ప్రియుడు,క్రిమినల్,అల్లుడా మజాకా,హలొ బ్రదర్,మేజర్ చంద్రకాంత్,అన్నమయ్య,ముద్దుల ప్రియుడు, నీలాంబరి, బలరామకృష్ణులు,సోగ్గాడి కాపురం,మానవుడు దానవుడు,వంశోద్ధారకుడు వంటి సినిమాలతో రమ్యకృష్ణ టాప్ రేంజ్ కి చేరుకొని ఇండస్ట్రీని ఏలింది.
మరోపక్క తమిళ మూవీస్ లో కూడా నటించి మెప్పించిన రమ్య తెలుగులో కోడి రామకృష్ణ తీసిన అమ్మోరు మూవీతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కిరాయి గుండా, ముగ్గురు మొనగాళ్లు,సూపర్ మొగుడు,ఆయనకిద్దరు వంటి ఎన్నో చిత్రాలు చేసింది. దక్షిణాది సినిమాల్లో రెండు దశాబ్దాల పాటు తన నటనతో ఉర్రూతలూగించిన అక్కినేని,ఎన్టీఆర్,కృష్ణ,శోభన్ బాబు వంటి హీరోలతో కల్సి పనిచేసిన అనుభవం గల ఈమె సూపర్ స్టార్ రజనీకాంత్ తో కల్సి నరసింహ మూవీ కొత్తకోణంలో విలనిజంతో మెప్పించింది.
ఇక ఈ మూవీ జపాన్,పారిస్ వంటి చోట్ల విడుదలై వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చింది. చిరంజీవి,బాలయ్య,వెంకటేష్,నాగార్జున,జగపతి బాబు వంటి హీరోలతో చేసింది. 1998లో కంటే కూతుర్ని కనాలి మూవీతో ఉత్తమ నటిగా నంది అవార్డు దక్కించుకుంది. ఎన్నో అవార్డులు అందుకున్న ఈమె శివగామి పాత్రతో తన నట విశ్వరూపం ప్రదర్శించి అవార్డులను,ఆడియన్స్ నుంచి ప్రశంసలను అందుకుంది. ఇక ఐడియల్ సోషల్ వెల్ఫేర్ క్లబ్ ఫర్ రమ్యకృష్ణ పేరిట ఆమె ఫాన్స్ ఓ సంస్థను పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.