‘ఏమాయ చేసావె’ సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు
1) నాగ చైతన్య రెండవ సినిమాగా రూపొందిందిన ‘ఏమాయ చేసావె’ చిత్రం నాగ చైతన్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ గా ఉంది.
2) ఈ సినిమాలో నాగ చైతన్య – సమంత మొదటిసారిగా కలసి నటించారు. సమంతాకి ఇది మొదటి తెలుగు సినిమా.
3) ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ. ఆర్. రెహమాన్ అందించిన సంగీతం సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ ఈ సినిమా పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి.
4) తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి నిర్మితమైన ఈ సినిమా తమిళ వెర్షన్ లో శింబు, త్రిష ప్రధాన పాత్రలు పోషించారు. ‘విన్నైతాండి వరువాయా’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ లో కూడా గౌతమ్ మీనన్ కు మంచి విజయం అందించింది.
5) ‘ఏమాయ చేసావె’ సినిమా హిందీలో ‘ఏక్ థా దీవానా’ పేరుతో రీమేక్ అయింది. కానీ సౌత్ లో సక్సెస్ అయినంత ఈ సినిమా నార్త్ లో ఆకట్టుకోలేకపోయింది.
6) గౌతమ్ మీనన్ – ఏ.ఆర్. రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన మొదటిసినిమా ‘ఏమాయ చేసావె’. ఈ సినిమా మూడు వెర్షన్ లకు రెహమానే సంగీతం అందించడం విశేషం.
7) తెలుగులో సమంత పోషించిన పాత్రను తమిళంలో త్రిష చేయగా.. హిందీ లో ఎమీ జాక్సన్ చేసింది.
8) ఏ.ఆర్. రెహమాన్ ‘ఏమాయ చేసావె’ చిత్రానికి తెలుగులో తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు.
9) డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేశాడు.
10) తెలుగు వెర్షన్ లో లీడ్ రోల్ చేసిన సమంత హిందీ మరియు తమిళ్ వెర్షన్స్ లో గెస్ట్ రోల్ చేసింది.
11) గౌతమ్ మీనన్ – నాగ చైతన్య – ఏ. ఆర్. రెహమాన్ కాంబినేషన్ లో ‘ఏమాయ చేసావె’ మొదటిచిత్రం కాగా ‘సాహసం శ్వాసగా సాగిపో’ అనేది వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం.
12) ఈ చిత్రంలో మహేష్ బాబు బావలైన సుదీర్ బాబు మరియు సంజయ్ స్వరూప్ లు కీలక పాత్రలు పోషించారు.
13) ఈ చిత్రం ద్వారానే సూపర్ జోడి అనిపించుకున్న సామ్ – చై లు రియల్ లైఫ్ లో కూడా సూపర్ జోడి అనిపించుకున్నారు.