Movies

చిన్న నటుడి స్థాయి నుండి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ గురించి అసలు నిజాలు ఇవే

సినిమాల్లో చిన్న నటుడిగా ఎంట్రీ ఇచ్చి ,ఆతర్వాత బిగ్ మూవీస్ ప్రొడ్యూసర్ గా ఎదిగి ,రాజకీయ నేతగా రాణిస్తున్న బండ్ల గణేష్ బాబు 1978మార్చి10న జన్మించాడు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న గణేష్ కి ఇద్దరు కుమారులు ,ఒక కూతురు ఉన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర తెలగాయ పల్లి గ్రామంలో పుట్టిన ఇతడికి శివ అనే బ్రదర్ ఉన్నాడు. ఏడాది వయసులోనే ఇతడి ఫ్యామిలీ కర్ణాటక లోని రాయచూర్ గ్రామంలో స్థిరపడింది. అక్కడ అతడి తండ్రి నాగేశ్వర్ పత్తి వ్యాపారం చేసారు. ఇక గణేష్ 6వ క్లాస్ చదువుతున్నప్పుడు షాద్ నగర్ కి వచ్చి సెటిల్ అయ్యారు. ఫౌల్ట్రీ ఫార్మ్ నడిపారు. ఇక చిన్నప్పటినుంచి చురుకైన గణేష్ ఇంటర్ లో ఫెయిలయ్యాడు.

సినిమాలు విపరీతంగా చూస్తూ ఆవారాగా తిరిగేవాడు. చిరంజీవి అభిమాని కావడంతో హీరో కావాలని కలలు కన్నాడు. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. దేవునితో సమానమని చెబుతాడు. సుస్వాగతం సినిమా సమయంలోనే పవన్ తో పరిచయం ఏర్పడింది. పదవతరగతి అయ్యాక సినిమాల్లో నటించాలని,మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నాడు. ఏడాది పాటు ఫిలిం నగర్ లో ఛాన్స్ లకోసం తిరిగాడు. ఇక షాద్ నగర్ వెళ్ళిపోయి ఇంటర్ పూర్తిచేసాడు.

తండ్రికి అండగా బిజినెస్ చూసుకున్నాడు. వీళ్ళ ఫౌల్ట్రీ బిజినెస్ తెలంగాణలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. అయితే తండ్రి ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చాడు. సారీ ఆంటీ అనే శృంగార చిత్రంలో హీరోగా ఛాన్స్ వచ్చింది. అందులో చేసినా ఏమాత్రం ఆడలేదు. వినోదం మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి, ఆడియన్స్ మన్ననలు అందుకున్న గణేష్ ఆతర్వాత, ఆహ్వానం,సిందూరం,సుస్వాగతం,ఉగాది,స్నేహితుడు,మాస్టర్, నువ్వు నాకు నచ్చావ్,అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి,శివమణి, అతడే ఒక సైన్యం,మల్లీశ్వరి,పోకిరి,యోగి,తులసి,అర్జున్,చింతకాయల రవి,బిజినెస్ మ్యాన్ మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసాడు.

తీన్ మార్ సినిమాకు తననే నిర్మాతగా చేయమని కొమరం భీం సినిమా సమయంలో పవన్ చెప్పడంతో గణేష్ నిర్మాత అయ్యాడు. ఆతర్వాత తన అన్న శివ తో కల్సి పరమేశ్వర ప్రొడక్షన్స్ ప్రారంభించి సినీ నిర్మాణం ప్రారంభించారు. రవితేజ ఆంజనేయులు మూవీకి నిర్మాతగా చేసాడు. సినిమా ఆడకపోయినా ఐదు కోట్ల లాభం వచ్చిందని అప్పట్లో చెప్పాడు. ఆతర్వాత తీన్ మార్ సినిమా చేసినా ఆడియన్స్ ఆదరించలేదు.

ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో గబ్బర్ సింగ్ మూవీకి గణేష్ ప్రొడ్యూసర్ గా చేసి,బ్లాక్ బస్టర్ కొట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ తో బాద్షా ,అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో మంచి విజయాన్ని అందుకోవడంతో గణేష్ కి పేరు వచ్చింది. ఆతర్వాత నీ జతగా నేనుండగా మూవీ ఫైయిల్ అయింది. గోవిందుడు అందరి వాడేలే ,టెంపర్ మూవీస్ కి నిర్మాతగా వ్యవహరించి మంచి హిట్స్ అందుకున్నాడు. రామానాయుడు మాదిరిగా ఓ స్టూడియో కట్టాలని ఉందని గణేష్ అంటున్నాడు. 2018 సెప్టెంబర్ లో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరాడు.