చిరంజీవి చుట్టూ దాగిన మీకు తెలియని వ్యాపార సామ్రాజ్య రహస్యాలు
చిన్న చిన్న పాత్రలు వేస్తూ మెగాస్టార్ ఎదిగిన సినీ రారాజు చిరంజీవి గురించి మనకు తెలీని ఎన్నో విషయాలు , వ్యాపార సామ్రాజాలు ఉన్నాయి. అల్లు రామలింగయ్యకు అల్లుడిగా, సురేఖకు భర్తగా, నాగబాబు,పవన్ కళ్యాణ్ లకు అన్నగా, అల్లు అరవింద్ కి బావగా, రామ్ చరణ్ కి తండ్రిగా ఇలా విభిన్న కోణాల్లో తన దైన శైలిలో అందరి వాడుగా ఉంటూ, సినిమాలతో ఫాన్స్ అభిమానాన్ని దండిగా పొందాడు. అందనంత ఎత్తుకి ఎదిగాడు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ఆతరువాత కాంగ్రెస్ లో విలీనం చేసి, కేంద్ర మంత్రి అయ్యాడు. ఇవన్నీ అందరికి తెల్సిన విషయాలే. అయితే చిరంజీవికి అపోలో మొదలుకుని,జివికె, టి సుబ్బిరామిరెడ్డి వరకూ ఎన్నో వ్యాపార కుటుంబాలతో బంధం ఉంది.
చిరంజీవి బావ,గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ని తీసుకుంటే,మనకు మెగా ప్రొడ్యూసర్ గానే తెలుసు. కానీ సినీ సామ్రాజ్యంలో అధిపతి లాంటి వాడు. ఇండస్ట్రీలోని నాలుగు స్తంభాల్లో ఒకడిగా ఎదిగిన అల్లు అరవింద్ ఏది శాసిస్తే అది జరుగుతుంది. అలా సినీ ప్రపంచాన్ని చిరంజీవి తన గుప్పిట ఉంచారు. కొడుకు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలు తీస్తూ,మరోపక్క ట్రూజెట్ విమానయాన రంగంలో అడుగుపెట్టాడు.
ఇక అపోలో అధినేత ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసన కు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కి పెళ్లవ్వడంతో అపోలోతో బంధం ఏర్పడి హాస్పిటల్ రంగంలో చిరంజీవి హవా కొనసాగుతోంది. పైగా 16ఏళ్ళ పాటు ఉత్తమ ప్రయివేట్ హాస్పిటల్ గా పేరుగాంచిన అపోలో దేశవ్యాప్తంగా తన సత్తా చాటింది. ఇలాంటి హాస్పిటల్ అధిపతి వారసురాలు మెగాస్టార్ కోడలుగా రావడం వైద్య రంగంలో కూడా చరిష్మా నడుస్తోంది.
ఇక ఉపాసన తల్లి శోభనకు సంగీతా రెడ్డి అనే ఓ అక్క ఉంది.
ఉపాసనకు ఈమె పెద్దమ్మ అవుతుంది. సంగీతా రెడ్డి భర్త చేవెళ్ల ఎంపీగా ఉన్న విశ్వేశ్వర రెడ్డి. ఇక వీరి కొడుకు ఆనంద్ పెళ్లి జివికె రెడ్డి మనవరాలు శ్రీయ భూపాల్ తో అయింది. నిజానికి శ్రీయ భూపాల్ ను మొదట్లో తన వ్యాపార భాగస్వామి నాగార్జున కుమారుడు అఖిల్ కి ఇచ్చి పెళ్ళిచేయడానికి చిరంజీవి నిర్ణయం తీసుకున్నాడు.
నిశ్చితార్ధం అయ్యాక ఎందుకో బెడిసి కొట్టింది. అయితే శ్రీయ భూపాల్ చిరు కుటుంబానికి దగ్గరైంది. ఆవిధంగా జివికె వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా శాసిస్తున్నాడు. సినిమా ప్రపంచంతో సంభంధం గల టి సుబ్బిరామిరెడ్డితో కూడా చిరంజీవి కి బంధం ఉంది. ఈయనకు షుగర్ ఫ్యాక్టరీలు, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి ఇక ఉపాసన కు ఆనంద్ రెడ్డి అనే కజిన్ ఉన్నాడు. ఆనంద్ రెడ్డి కి శ్రేయ భూపాల్ తల్లి షాలిని రెడ్డి అత్త అవుతుంది. షాలిని సోదరుడు సంజా రెడ్డి స్వయానా సుబ్బరామిరెడ్డి కూతురు ని పెళ్లి చేసుకున్నాడు.