Movies

హిట్ ప్లాప్ లతో నడుస్తున్న నాగ చైతన్య సినిమాల్లోకి రావటానికి అసలు కారణం ఏమిటో తెలుసా?

జోష్ సినిమాతో వెండితెరకు పరిచయమైన నాగ చైతన్య 1986 నవంబర్ 23న అక్కినేని నాగార్జున,లక్ష్మి దంపతులకు జన్మించాడు. అయితే కొన్ని కారణాల వలన నాగ్, లక్ష్మి దంపతులు విడాకులు తీసుకున్నారు. అయితే చెన్నైలో ఉంటున్న తల్లి లక్ష్మి దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇంటర్ వరకూ తల్లి దగ్గరే పెరిగిన నాగ చైతన్య మరోపక్క నాగార్జునతో,అమలతో కూడా సఖ్యతగా ఉండేవాడు. నాగ్,అమల దంపతుల కుమారుడు అఖిల్ నాగచైతన్యకు తమ్ముడు అవుతాడు. అతడు కూడా సినిమాల్లో ఉన్నాడు. కాలేజీలో చదివేటపుడు గిటార్ వాయించి పాపులర్ అయ్యాడు. హైదరాబాద్ లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుండగా సినిమాల్లో నటిస్తానని చెప్పడంతో ముంబయిలో మూడు నెలల శిక్షణ కోర్సులో నాగార్జున జాయిన్ చేసాడు.

లాస్ యాంజిల్స్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది,డైలాగ్ డెలివరీలో ఏడాదిపాటు శిక్షణ కూడా పొందాడు. కార్ రేస్ లపై అభిలాష గల నాగ చైతన్య ఇప్పటికీ అందులో పాల్గొంటాడు. ఏం మాయ చేసావే మూవీతో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య అదే సినిమాలో హీరోయిన్ గా వేసిన సమంతను లవ్ చేసి పెళ్లాడాడు. దిల్ రాజు నిర్మాణంలో జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సరసన ప్రముఖ నటి కార్తీక నటించింది. ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేదు.

అయితే ఉత్తమ నటుడుగా నాగచైతన్యకు ఫిలిం ఫేర్,నంది అవార్డులను తెచ్చిపెట్టింది. 2010లో వచ్చిన ఏం మాయ చేసావే సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆతర్వాత సుకుమార్ డైరెక్షన్ లో 100%లవ్ మూవీ వచ్చింది. తమన్నాతో జోడి కట్టిన ఈ మూవీ విజయం సాధించింది. అయితే కాజల్ తో కల్సి నటించిన దడ మూవీ ఆకట్టుకోలేదు. అలాగే వివేక్ కృష్ణ డైరెక్షన్ లో అమలాపాల్ హీరోయిన్ గా వచ్చిన బెజవాడ మూవీ కూడా డిజాస్టర్ అయింది.

అలాగే సమంత సరసన చేసిన ఆటోనగర్ సూర్య ప్లాప్ అయింది. నటించడం రాదని విమర్శలు వచ్చినా నిరుత్సాహ పడలేదు. ఆతర్వాత వచ్చిన తడాఖా మూవీ విజయం సాధించింది. సునీల్,తమన్నా, ఆండ్రియా ఇందులో నటించారు. ఇక మనం సినిమా అంచనాలను మించి విజయాన్ని అందుకుంది. దోచేయ్ మూవీ క్లిక్ అవ్వలేదు. మలయాళీ మూవీ ప్రేమమ్ రీమేక్ తో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు. సాహసమే శ్వాసగా మూవీ ఓ మోస్తరు విజయం అందుకుంది.

శైలజారెడ్డి అల్లుడు దెబ్బతింది. అయితే యుద్ధం శరణం మూవీ కూడా పోయింది. కాగా 2017లో రారండోయ్ వేడుక చూద్దాం మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టింది. ఇక సవ్యసాచి మూవీ ఆడలేదు. సమంతతో కల్సి మజ్ను మూవీ, అలాగే వెంకటేష్ తో కలిస్ వెంకీ మామ మూవీ చేస్తున్నాడు. ఏం మాయ చేసావే సినిమా సమంతకు తొలి సినిమా కావడంతో నాగచైతన్య కొన్ని సలహాలు ఇచ్చేవాడు. ఆ విధంగా మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

ఇక మనం సినిమా సమయంలో నాగచైతన్య లవ్ ప్రపోజ్ చేసాడు. అలా ఇద్దరి మధ్యా ప్రేమ చాన్నాళ్లు సాగడం,తమ ఇళ్లల్లో చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో 2017అక్టోబర్ 6న గోవాలో పెద్దల సమక్షంలో పెళ్లయింది. ఇక పెళ్లయ్యాక నాగ చైతన్య వంట చేస్తున్న ఫొటోస్,ఇద్దరూ ఆనందం గా గడుపుతున్న ఫొటోస్ షోషల్ మీడియాలో పోస్ట్ చేసి,తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.