Movies

టాలీవుడ్ హీరోల సైడ్ బిజినెస్….ఎవరు ఏమి చేస్తున్నారో చూడండి

అక్కినేని నట వారసుడిగా రాణిస్తున్న కింగ్ నాగార్జున సినిమా నిర్మాణంలో భాగం పంచుకోవడమే కాదు,యంగ్ గిల్ రెస్టారెంట్ కన్వెన్షన్ సెంటర్ నడిపిస్తున్నాడు. కేరళ బ్లాస్టర్ జట్టుకి కో ఓనర్ గా ఉన్నాడు.

ఇక చిరంజీవి కూడా నాగ్ తో కల్సి కేరళ బ్లాస్టర్ జట్టుకి పెట్టుబడి పెట్టాడు. మాటీవీలో కూడా గతంలో భాగస్వామ్యం వహించాడు.

ఇక మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ చిన్న వయస్సులోనే వ్యాపార రంగంలో కాలుపెట్టాడు. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ కి ఓనర్ అయ్యాడు. టర్బో ఎయిర్ వే సంస్థను నెలకొల్పి దిగ్విజయంగా నడిపిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు తీస్తున్నాడు.

అలాగే అల్లు అరవింద్ కుమారుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ అంతర్జాతీయ కంపెనీతో కల్సి 800జూబ్లీ అనే పెద్ద రెస్టారెంట్ స్టార్ట్ చేసాడు. యువ సెలబ్రిటీలు ఎంజాయ్ మెంట్ కి వేదికగా ఉంది.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటుడిగా సక్సెస్ అవ్వడమే కాదు, లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల స్థాపకునిగా విజయవంతంగా నడిపిస్తున్నాడు.

ఇక ఈయన కొడుకు మంచు విష్ణు తన భార్య వెరోనికా తో కల్సి అంతర్జాతీయ ప్రమాణాలతో న్యూయార్క్ అకాడమీ అనే విద్యా సంస్థను స్థాపించాడు. పలు కంపెనీల్లో వాటాదారుడిగా ఉన్నాడు.

మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు మనవడు,నిర్మాత సురేష్ తనయుడు రానా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వక ముందు వి ఆఫ్ ఎక్స్ కంపెనీకి ఓనర్ గా ఉండేవాడు. ఇక ఇండస్ట్రీకి వచ్చాక ముంబయిలోని కాకాన్ అనే మేనేజ్ మెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. కొత్త నటీనటులు, టెక్నీషియన్స్ ని పరిచయం చేసే సంస్థ ఇది.

కాగా నటుడు,క్రీడాకారుడు సచిన్ జోషి తన తండ్రి జె ఎం జి గ్రూప్ బాధ్యతలు చూస్తూనే నిర్మాతగా కొన్ని సినిమాలు తీసాడు. తెలుగు వారియర్స్ క్రికెట్ జట్టుకి ఓనర్ గా ఉన్నాడు.

ఇక హీరో జగపతి బాబు ఎన్నో చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేయడమే కాకుండా ఇప్పుడు విలనిజంలో మెప్పిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ తనయుడైన జగపతి బాబు టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ స్టార్ట్ చేసాడు. వెబ్ పోర్టల్ కూడా మొదలుపెట్టాడు. సినిమా రంగంలో అడుగుపెట్టాలనుకునేవారికి సంధాన కర్తగా ఉన్నాడు.

ఇక పెయింటింగ్ అంటే ఇష్టపడే నటుడు కమల్ కామరాజ్ తాను గీసిన బొమ్మలతో గ్యాలరీ ఏర్పాటుచేసి పెయింటింగ్స్ విక్రయిస్తున్నాడు. అలాగే సై మూవీ ద్వారా గుర్తింపు పొందిన శశాంక్ అలనాటి క్లాసికల్ మూవీ మాయాబజార్ పేరిట రెస్టారెంట్ నడుపుతున్నాడు. తెలుగువారికి ఇష్టమైన వంటకాలను అందిస్తున్నాడు.

యువ హీరో నవదీప్ రా ప్రొడక్షన్ పేరిట ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ నెలకొల్పి బెస్ట్ ఎంటర్ ప్రెన్యూర్ గా ఉన్నాడు. యువ హీరో శర్వానంద్ ద అర్బన్ విలేజ్ కాఫీ టాగ్ లైన్ తో బింజ్ అనే కాఫీ షాప్ స్టార్ట్ చేసాడు. వివిధ దేశాల కాఫీలు ఇక్కడ లభిస్తాయి.