Movies

శోభన్ బాబు ఎవరి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ , అక్కినేని లను ఆదర్శంగా తీసుకున్న అందాల నటుడు శోభన్ బాబు తన సహచరులకు మాత్రమే ఆయనే స్ఫూర్తిగా నిలిచారు. ఈ ప్రపంచంలో జనాభా పెరుగుతుంది,అవసరాలు పెరుగుతాయి కానీ భూమి మాత్రం పెరగదన్న వాస్తవాన్ని జీర్ణించుకున్న శోభన్ బాబు భూమిని నమ్ముకున్నారు. అందరికీ ఆదిశగా సలహాలిచ్చి ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేసారు. మొత్తం మీద దక్షిణ భారత దేశంలోనే అత్యంత సంపన్న నటుడు ఎవరంటే శోభన్ బాబు పేరే చెబుతారు. ఈయన ఆస్తుల విలువ 80వేల కోట్లని టాక్. అతడి ఆర్ధిక క్రమశిక్షణ ఎలాంటిదో చెప్పక్కర్లేదు. ఇక భర్త మాట జవదాటకుండా ఆయనకు అనుకూలంగా కాపురం చేసిన ఆయన భార్య శాంతకుమారి పాత్ర కూడా కీలకం అని చెప్పాలి. నిజానికి శోభన్ బాబు జీవితంలో ఆయన శ్రీమతి గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. అలాగే శోభన్ బాబు వృద్ధాప్యంలో ఎలా ఉంటారో ఎవరికీ తెలియకుండా పోయింది.

శోభన్ బాబు అందగాడే అయినా, ఆయన శ్రీమతి మాత్రం ఆయనకు తగ్గ అందగత్తె కాదు. అందుకే ఇంటికి ఎవరైనా వస్తే కాఫీ,టీలు మొదలుకుని అన్నీ ఆయనే సర్వ్ చేసేవారట. అందుకే ఆమె ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. చూడ్డానికి,చక్కగా కనిపించడానికి శోభన్ బాబు ఎంతో ప్రాధ్యాన్యత ఇస్తారు. దీనికి కారణం ఉంది. గూఢచారి 116సినిమాకు హీరోగా శోభన్ బాబుని ఎంపిక చేయాలనుకున్నారట.

అయితే నాలుగు కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ పై ఎండలో తొక్కుకుంటూ వచ్చేసరికి చెమటలు కక్కుతూ, కమిలిపోయి కనిపించాడు. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా జయలలిత ని ఎంపిక చేస్తున్నారు. అయితే జయలలిత తల్లి సంధ్య ఆసమయంలో శోభన్ బాబుని చూసి ఇలాంటి అందవిహీనుడి పక్కన మా అమ్మాయి యాక్ట్ చేయడం ఏమిటి అనేసారు. ఎట్టి పరిస్థితుల్లో తన కూతురు ఇతడి పక్కన నటించదని తెగేసి చెప్పేసిందట. దాంతో ఛాన్స్ మిస్సయిపోయాడు. అది కాస్తా సూపర్ స్టార్ కృష్ణకు దక్కింది.

ఇక అప్పటినుంచి శోభన్ బాబు అందంగా తయారవ్వడానికి శ్రద్ధ పెడుతూ వచ్చారు. మరి ఇంత అందగాడికి సరైన శ్రీమతి దొరక్కపోవడానికి కారణం ఏమిటంటే శోభన్ బాబు చాలా పేదరికం అనుభవించారు. లా చదవడానికి చెన్నై కి వచ్చిన శోభన్ బాబుకి ఆయన టీచర్ అండగా నిలిచారు. ఇక టీచర్ ఋణం తీర్చుకోడానికి విధిలేని పరిస్థితిలో ఆయన కూతురుని పెళ్లాడారు. అయితే ప్రేమాభిమానం విషయానికి వస్తే,జయలలిత తోనే శోభన్ తన ప్రేమ జీవితాన్ని పంచుకున్నారు.

శోభన్ బాబు నుదుట తిలకం లా వుండే హెయిర్ రింగ్ స్టైల్ , సెంట్, డ్రెస్ లు ఇలా అన్నింటినీ జయలలిత సెట్ చేసారు. శోభన్ జీవితాన్ని ఆమె తీర్చిదిద్దింది. అందుకే జయతో తెలియని మధురానుబంధం పెనవేసుకుంది. ఇండస్ట్రీలో ఎవ్వరితోనూ చనువుగా ఉండని జయ,ఒక్క శోభన్ బాబుతోనే మనసు విప్పి మాట్లాడుతూ ఆనందంగా ఉండేది. ఎంతో అన్యోన్యంగా ఉంటూ చివరకు ఇద్దరూ త్యాగం కూడా చేసుకున్నారు.